Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్? లొంగిపోవడానికే వచ్చాడా??

ఖలిస్తానీ వేర్పాటు వాద నేత అమృత్ పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఇంటిజెన్స్ వర్గాలు. అందుకే తిరిగి పంజాబ్ కు వచ్చినట్టుగా అనుమానిస్తున్నాయి. 

Amrit Pal Singh back in Punjab? he come to surrender says police sources - bsb
Author
First Published Mar 29, 2023, 4:08 PM IST

పంజాబ్ : పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అమృత్ పాల్ సింగ్ లొంగిపోనున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు తాను లొంగిపోయే ముందు ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసమే అమృత్ పాల్ సింగ్  పంజాబ్ తిరిగి వచ్చినట్లుగా పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. గత పది రోజులుగా ‘వారిస్ పంజాబ్ దే’  చీఫ్…ఖలిస్తానీ వేర్పాటు వాదనేత.. అమృత్ పాల్ సింగ్ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్లో ఖలిస్తానీ వేర్పాటు వాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి అతను కుట్రపడ్డాడు.

ఈ మేరకు విషయం తెలియడంతో పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరుల మీద భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని పారిపోగా అతని అనుచరులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసుల కన్నుగప్పి ఉడాయించిన అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు  ప్రయత్నాలు చేశాడు. ఈ మేరకు ఇంటిలిజెంట్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై మమతా బెనర్జీ రెండు రోజుల నిరసన దీక్ష..

అమృత్ పాల్ సింగ్, అతడి సహచరులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మంగళవారం రాత్రి వీరిని పట్టుకునేందుకు పోలీసులు హోషియార్ పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు.హోషియార్ పూర్ లోని మారయాన్ గ్రామంలోని గురుద్వారా దగ్గర పొలాల్లో అమృత్ పాల్ సింగ్ తన ఇన్నోవా కారును వదిలేసి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం ఉండడంతో అమృత్పాల్ సింగ్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకే పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. 

అమృత్ పాల్ సింగ్ లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసమే అతడు పంజాబ్ కు తిరిగి వచ్చాడని లొంగిపోయే ముందు అంతర్జాతీయ వార్తా సంస్థ ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా వారికి పక్కా సమాచారం అందింది. గత నెల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. అక్కడి ఎస్పీతో సహా పలువురు పోలీసుల మీద దాడి చేసి… పోలీస్ స్టేషన్లో ఉన్న తన మద్దతుదారులను విడిపించుకుపోయాడు. 

అప్పటినుంచి అతడి ని అరెస్టు చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ సహకారం అంతుందని.. విదేశాల నుంచి నిధులు కూడా  వస్తున్నాయని ఇంటిలిజెంట్ వర్గాలు చెబుతున్నాయి. అమృత్ పాల్ సింగ్ సన్నిహితులకు పాకిస్తాన్తో లింకులు ఉన్నట్లుగా కూడా బయటపడింది. పాకిస్తాన్, దుబాయ్ లలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాదులతో అమృత్ పాల్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios