Asianet News TeluguAsianet News Telugu

"దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది": మణిపూర్ వీడియో విడుదలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు ..

వర్షాకాల సమావేశానికి ముందు మణిపూర్ వీడియోలను వైరల్ చేయడం కుట్ర అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.   

Amit Shah on timing of Manipur women assault video release KRJ
Author
First Published Jul 29, 2023, 3:39 AM IST

మణిపూర్ చెలారేగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 3 నెలలుగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఘటనలపై దర్యాప్తు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీబీఐకి సిఫార్సు చేసింది. 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలు సహా ఏడు ఘటనల దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతే కాదు, ఈ కేసుల విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలనే డిమాండ్ కూడా వచ్చింది.

ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. ఈ వీడియోను వైరల్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైరల్ వీడియోను చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు అతడి మొబైల్‌ను కూడా సీజ్ చేసి విచారణ చేపట్టారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను లీక్ చేయడం కుట్రగా అనిపిస్తోందని ఆయన అన్నారు. రెండు వైరల్ వీడియోలకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.మణిపూర్‌ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు 2022లో మయన్మార్‌లో జరిగిన ఘటనల వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మణిపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు.

3 కేసులు ఎన్‌ఐఏకి, 3 సీబీఐకి

మణిపూర్‌ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే 6 కేసులను ఇప్పటికే సీబీఐకి పంపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మరో మూడు కేసులను కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. వైరల్ వీడియో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతే కాకుండా ఈ కేసుల విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలన్న డిమాండ్ కూడా ఉంది. మరో రాష్ట్రంలో కేసును నడపడానికి అనుమతి ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందని ప్రభుత్వం పేర్కొంది.

 ఇప్పటివరకు 147 మంది హతం

మణిపూర్‌లో రెండున్నర నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 147 మంది చనిపోయారు. ఇది కాకుండా 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. హింసాకాండ అడపాదడపా కొనసాగుతోంది. ఈలోగా ఇద్దరు మహిళలు నగ్న కవాతు నిర్వహిస్తున్న వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో  సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కోరడంతో ఈ డిమాండ్‌పై దుమారం రేగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios