బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తో అమిత్ షా భేటీ

Amit Shah meets Madhuri Dixit
Highlights

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు అమిత్ షా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ను కలిశారు.

ముంబై: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు అమిత్ షా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ను కలిశారు.  సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆమెను కలిశారు.  బుధవారం ముంబై వచ్చిన ఆయన మాధురీ దీక్షిత్‌, ఆమె భర్త డాక్టర్. శ్రీరామ్ మాధవ్‌ను కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా పలువురు పార్టీ నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైన సందర్భంగా అమిత్‌ షా సంపర్క్ ఫర్ సమర్థన్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇందులో భాగంగా ఆయన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకుని మద్దతు కోరుతున్నారు. బుధవారంనాడు ముంబైలో మాధురీ దీక్షిత్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, సుప్రసిద్ధ గాయిని లతా మంగేష్కర్ తదితరులతో సమావేశమవుతారు.

అమిత్ షా ఒక్కరే 50 మందిని సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా కలుస్తారు ఆయన అపపటికి కపిల్ దేవ్, ఆర్ సీ లహోటీ, బాబా రామ్ దేవ్, దల్బీర్ సింగ్ సుహాగ్ లను కలిశారు.

loader