కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాయుధ బలగాలలో సైనికుల నియామక ప్రక్రియను సమూలంగా మార్చే అగ్నిపథ్ పథకం, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దారితీసిన విషయం తెలిసిందే. "మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన మంచి విషయాలు" మీద ఇలా రాజకీయాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 

ఢిల్లీ : Agneepath Schemeపై దేశవ్యాప్త నిరసనల మధ్య, ప్రధాని Narendra Modi చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ‘మంచి ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన అనేక మంచి విషయాలు రాజకీయాల్లో చిక్కుకోవడం దేశ "దురదృష్టం"’ అని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా ప్రత్యక్షంగా అగ్నిపథ్ నిరసనల గురించి అనేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించలేదు. అయితే, రాజకీయ పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో దీనికోసమే ఈ వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు చెలరేగాయి. 

సోమవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లోని ప్రధాన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు, పశ్చిమ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మెట్రో ట్రాక్‌లను రెట్టింపు చేయడం, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇతర ప్రాజెక్టులలో ఢిల్లీ-మీరట్ హైవే వంటి అనేక కార్యక్రమాలను మోదీ ఉదహరించారు. 

‘సదుద్దేశంతో తీసుకొచ్చిన ఎన్నో మంచి విషయాలు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దౌర్భాగ్యం.. మీడియా కూడా టీఆర్‌పీ కోసం ఈ రాజకీయాల్లోకి లాగబడుతోంది’ అన్నారు. ఇక సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌, కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణంపై మాట్లాడుతూ వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో భారత రాజధాని గురించి మాట్లాడుకుంటామని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుందని అన్నారు.

Agnipath stir : నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. హైఅలర్ట్..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు అడ్డంకులు కలిగించడం, కోర్టుకు వెళ్ళడం..దీనిమీద ఒక వర్గం కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ విషయంలో కూడా నిరసనలను ఎదురయ్యాయి. 

సాయుధ దళాలలో సైనికుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సమూలంగా మార్చే తన ప్రభుత్వంఅగ్నిపథ్ పథకం దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలకు దారితీసిన సమయంలో, "మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన మంచి విషయాలు" రాజకీయాల్లో చిక్కుకోవడం గురించి మోడీ చేసిన వ్యాఖ్యలు రావడం గమనార్హం. దీనిని ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, అధికార బీజేపీ మాత్రం గట్టిగా సమర్థిస్తోంది. అయితే, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో తన ప్రభుత్వం చేస్తున్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై ఎక్కువగా దృష్టి సారించిన ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పథకం గురించి నేరుగా ప్రస్తావించలేదు.

ఇదిలా ఉండగా, రక్షణ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టి కొత్త స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌పై సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) హై అలర్ట్ ప్రకటించారు.ఎక్కడ అల్లర్లు చెలరేగినా కఠినంగా వ్యవహరించాలని RPF సీనియర్ అధికారులు అన్ని యూనిట్లకు అంతర్గత కమ్యూనికేషన్ ప్రకటనను విడుదల చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని కఠినమైన సెక్షన్ల కింద అల్లర్లకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీటీవీల ద్వారా అల్లర్లు జరిగితే.. దానికి సంబంధించి డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులకు తెలిపారు.