సవరించిన పౌరసత్వ చట్టం వచ్చే నెల నుంచి అమల్లోకి..!

సవరించిన పౌరసత్వ చట్టాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కొన్ని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి.
 

amended citizenship act to be implemented from next month says sources kms

పౌరసత్వ చట్టంలో సవరణలు తేవడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. 2019లో పార్లమెంటు ఈ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. వచ్చే నెల నుంచి ఈ సవరించిన పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తేనున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ కొత్త చట్టం భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి తొలిసారి మతాన్ని కూడా పేర్కొంది. తద్వార ముస్లిం మెజార్టీగా ఉన్న పొరుగు దేశాల్లో మత పీడన ఎదుర్కొని శరణార్థులుగా మన దేశానికి వచ్చిన వారికి ఉపశమనం లభిస్తుందని భారత ప్రభుత్వం భావించింది. 

అయితే.. ఈ సవరణ ముస్లింలపై వివక్ష చూపుతుందని, భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి అయినా లైకిక విధాననికి విఘాతాన్ని కలిగిస్తుందని విమర్శలు వాదించారు.

Also Read: Medaram Jathara: మేడారం జాతరలో ఎన్ని హుండీలు నిండాయి? అవి ఎవరికి చెందుతాయి?

పౌరసత్వ సవరణ చట్టానికి ముందుగా లాంగ్ టర్మ్ వీసాలను ఆమోదించే అధికారాన్నిజిల్లా అధికారులకు ఇప్పటికే అప్పగించారు. గత రెండేళ్లలో సుమారు 30 జిల్లాల్ల మెజిస్ట్రేట్‌లు, తొమ్మిది రాష్ట్రాల హోం సెక్రెటరీలకు ఈ పౌరసత్వాన్ని ప్రసాదించే అధికారాలను ఇవ్వబడ్డాయి. ఈ చట్టం కింద పొరుగునే ఉన్న ముస్లిం దేశాలైన అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని నాన్ ముస్లిం మైనార్టీలకు వీరు పౌరసత్వం అందించారు. 

ఈ మూడు దేశాల నుంచి వచ్చిన మొత్తం 1,414 నాన్ ముస్లిం మైనార్టీలకు ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో భారత పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా లేదా నాచురైలేజషన్ కింద అందించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios