Asianet News TeluguAsianet News Telugu

జాక్‌పాట్ కొట్టిన అంబులెన్స్ డ్రైవర్: రూ. కోటీ లాటరీ గెల్చుకొన్న హీరా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అంబులెన్స్ డ్రైవర్ షేక్ హీరా లాటరీలో జాక్ పాట్ దక్కింది. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన హీరాకు కోటి రూపాయాలు దక్కాయి. ఉదయాన్నే లాటరీ కొనుగోలు చేస్తే సాయంత్రానికే ఆయన కోటీశ్వరుడయ్యాడు. 

Ambulance Driver From West Bengal Wins Jackpot Lottery
Author
New Delhi, First Published Dec 12, 2021, 4:52 PM IST

కోల్‌కత్తా: West Bengal రాష్ట్రానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ Sheikh Heera రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. రూ. 270 లతో కొనుగోలు చేసిన Lottery   టికెట్  హీరాకు కోటి రూపాయాలను తెచ్చి పెట్టింది. లాటరీ టికెట్ కొన్న రోజునే ఆయనకు లాటరీలో కోటి రూపాయాలు దక్కాయి. అయితే ఈ లాటరీ టికెట్ ను భద్రంగా దాచుకోవడం కోసం ఆయన పోలీసులను కూడా ఆశ్రయించాడు. లాటరీ టికెట్ పోతోందోననే భయంతో ఆయన పోలీసుల రక్షణ కోరాడు. హీరాను పోలీసులు జాగ్రత్తగా ఇంటి వద్ద దింపారు. అంతేకాదు ఆయన ఇంటికి రక్షణ కూడా కల్పించారు. 

also read:గెట్ వెల్ సూన్ కార్టుతో అదృష్టం పట్టింది.. ఏకంగా కోట్లలో లాటరీ కొట్టేశాడు..

అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించుకొనేందుకు హీరాకు Money అవసరం. అయితే ఈ డబ్బులను పోగు చేసుకొనేందుకు గాను  హీరా ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఏదో ఒక రోజున తాను లాటరీ గెలుచుకోవాలని కలలు కన్నానని ఆయన చెప్పారు. లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నానని చివరగా  తనను అదృస్టం వరించిందని ఆయన ఆనందంగా చెప్పారు.హీరా కు టికెట్ ను విక్రయించిన దుకాణ యజమాని Sheikh Hanif కూడా సంతోషంగా ఉన్నాడు. తాను చాలా ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నానని చెప్పారు. కానీ కొన్ని రివార్డులు అప్పటికప్పుడే వచ్చాయన్నారు. కానీ తాను విక్రయించిన లాటరీ టికెట్ కు జాక్ పాట్ ప్రైజ్ దక్కలేదన్నారు. తన తల్లికి మంచి వైద్యం చేయించి, ఉండటానికి చక్కని ఇల్లును ఈ డబ్బుతో కట్టిస్తానని షేక్ హీరా తెలిపారు. గతంలో కూడా ఇదే తరహలో రాత్రికి రాత్రే లాటరీల్లో కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు. దుబాయ్ లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు ఎక్కువగా ఈ  లాటరీలను గెలుచుకొన్నారు. మరో వైపు ఇతర రాష్ట్రాల్లో కూడా లాటరీల్లో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించిన వారు కూడా లేకపోలేదు.


.
 

Follow Us:
Download App:
  • android
  • ios