భారీ డిస్కౌంట్లు: 30 గంటల పాటు భారీ ఆఫర్లను ప్రకటించనున్న అమెజాన్

Amazon plans mega 30-hours sale next month to counter Walmart-Flipkart
Highlights

భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్


న్యూఢిల్లీ: జూలై 7 నుండి 15 మధ్య కాలంలో  అమెజాన్ ఇండియా డిస్కౌంట్ సేల్స్  ప్రారంభించనుంది. 30 గంటల పాటు ఈ సేల్స్‌ను నిర్వహించనుంది. వాల్ మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లు  జత కట్టాయి. దీనికి పోటీగా అమెజాన్  వచ్చే నెలలో  కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లతో  వినియోగదారులకు ఆఫర్లను ఇవ్వనుంది.

జూలై 7 నుంచి జూలై 15 మధ్యలో అమెజాన్‌ ఇండియా ఈ సేల్‌ను నిర్వహించాలని ప్లాన్‌చేస్తుందని నలుగురు టాప్‌ విక్రయదారులు తెలిపారు. అంతకముందు ఎన్నడూ చూడని డిస్కౌంట్లను ఈ 30 గంటల సేల్‌లో వినియోగదారులు చూస్తారని పేర్కొన్నారు. 

 30 గంటల పాటు ఈ సేల్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని అమెజాన్‌ చూస్తోంది. ప్రైమ్‌ షాపర్స్‌ ఆధారంగా చేసుకుని భారీ డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించబోతుందని అమెజాన్‌ ఇండియాలో టాప్‌ సెల్లర్స్‌ చెప్పారు.  ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలో కూడా ఈ సేల్‌ దోహదం చేయనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ సేల్‌తో ఎక్కువ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను కూడా పొందాలని అమెజాన్‌ చూస్తోంది. నెలవారీ రెవెన్యూ అంతా ఈ 30 గంటల్లోనే అమెజాన్‌ ఆర్జిస్తుందని విక్రయదారులు చెప్పారు. అమెరికా తర్వాత అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు.. 672 బిలియన్‌ డాలర్లు కలిగిన భారత రిటైల్‌ మార్కెటే అత్యంత ప్రాధానమైనది.
 

loader