పంజాబ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఇది హెచ్చరికేనన్నారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోవడం, ఐదుగురు కాంగ్రెస్ ప్రముఖులు బీజేపీలో చేరడంపై మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ (Capt. Amarinder Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు జరగబోయే భారీ నష్టానికి ఇదో చిన్న సంకేతమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర మాజీ మంత్రులైన డాక్టర్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్ ప్రీత్ సింగ్ కంగార్, సుందర్ శ్యామ్ అరోరా, థిల్లాన్‌లు శనివారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో వీరు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనిపై ఓ ట్వీట్టర్ ద్వారా కెప్టెన్ అమరీందర్ స్పందించారు. సరైన మార్గంలో, సరైన చర్య తీసుకున్నారంటూ బల్బీర్ ఎస్.సిద్ధూ, కంగార్, వెర్కా, అరోరా, కేవల్ సింగ్ థిల్లాన్‌లకు తన ట్వీట్‌లో ఆయన అభినందనలు తెలియచేశారు. ఈ నలుగురు నేతలు అమరీందర్‌కు సన్నిహితులు కూడా.
కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఇటీవలే పంజాబ్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు జాఖర్ రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. శనివారం మరో నలుగురు జాఖడ్ బాటే పట్టడంతో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది.
Also Read:సునీల్ జాఖర్ బీజేపీలో చేరకముందే ఆ పార్టీ కోసం పని చేశారు - పంజాబ్ కాంగ్రెస్ చీఫ్
బీజేపీలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్‌పై ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీలో అధికారికంగా గురువారం నాడు చేరారని.. కానీ అనధికారంగా ఆ పార్టీ కోసం చాలా కాలం నుంచే పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీలో చేరడం తాను ముందే ఊహించానని, ఇది కొత్త విషయం ఏమీ కాదని తెలిపారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసంతృప్తిగా ఉన్న సునీల్ జాఖర్ ఆ పార్టీకి మే 3వ తేదీన రాజీనామా చేశారు.
