మహిళపై పలు మార్లు బిఎస్ఎఫ్ జవాను అత్యాచారం

First Published 15, Jul 2018, 9:51 AM IST
Allegedly Being Raped By BSF Jawan In UP
Highlights

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. 26 ఏళ్ల మహిళను పెళ్లి పేరుతో నమ్మించిన బీఎస్ఎఫ్ జవాను ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు. 

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. 26 ఏళ్ల మహిళను పెళ్లి పేరుతో నమ్మించిన బీఎస్ఎఫ్ జవాను ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు. 

పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆమెను బెదిరించాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 6న విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మరణించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) అనిల్ కాపెర్వన్ తెలిపారు. బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

loader