Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధాని పరువు తీసేందుకే మలివాల్ వేధింపుల ఆరోపణలు - కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ చేసిన వేధింపుల ఆరోపణలు దేశ రాజధాని ప్రతిష్ట ను దిగజార్చే కుట్రలో భాగమే అని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీయే ఇదంతా చేయిస్తోందని ఆరోపించారు. 

Allegations of harassment by Maliwal to defame the national capital - Union Minister Meenakshi Lekhi
Author
First Published Jan 21, 2023, 5:18 PM IST

డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ వేధింపుల ఆరోపణలపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పలువురు బీజేపీ నాయకులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇది దేశ రాజధానిని అపఖ్యాతి పాలు చేయడానికి ఢిల్లీ అధికార పార్టీ చేసిన కుట్రలో భాగమని ఆరోపించారు. ఇదంతా ఢిల్లీ అధికార పార్టీ పన్నిన కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని అపఖ్యాతి పాలు చేసి నాశనం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. 

వార్తా ప్రచురణ సంస్థలకు కంటెంట్ కోసం దిగ్గజ టెక్ కంపెనీలు డబ్బులు చెల్లించాలి: కేంద్రం స్పష్టీకరణ

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ను వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడని లేఖి ఆరోపించారు. ఈ ఆరోపణలు ఢిల్లీ పరువు తీసే పథకంలో భాగమని తెలిపారు. కేంద్రం పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులను లక్ష్యంగా చేసుకునేందుకే ఆప్ ప్రభుత్వం నియమించిన మలివాల్ ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. 

స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న 47 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేతలు మనోజ్ తివారీ, షాజియా ఇల్మీ, ఆ పార్టీ ఢిల్లీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవ్ లు ఆప్ పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడిపోయిన బస్సు.. ఐదుగురు మృతి, 15 మందికి గాయాలు

అసలేం జరిగిందంటే ? 
ఢిల్లీలో మహిళల భద్రత ఎలా ఉందో స్వయంగా పరీక్షించేందుకు స్వాతి మలివాల్ తన టీమ్ కలిసి గత బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ సమీపంలోని రోడ్డు పక్కన నిలబడ్డారు. ఆ సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న డ్రైవర్ హరీష్ చంద్ర మత్తులో ఉన్నాడు. ఆమెతో మాట్లాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తనకు కారు అవసరం లేదని, తన బంధువులు వస్తున్నారని డ్రైవర్ కు సూచించారు. దీంతో ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

మళ్లీ కొంత సమయం తరువాత ఆ కారు యూటర్న్ తీసుకొని మలివార్ నిలబడిన చోటుకే వచ్చింది. దీంతో ఆమె అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఎందుకు వచ్చారని, తాను కారు ఎక్కనని ఇది వరకే చెప్పానని తెలిపింది. ఈ క్రమంలో డ్రైవర్ విండో దగ్గరకు వెళ్లి అతడితో మాట్లాడింది. అయితే ఇదే సమయంలో ఆ కారు డ్రైవర్ విండో గ్లాస్ లను ఎక్కించి అక్కడి నుంచి పోనిచ్చాడు. దీంతో ఆమె చేతి వేళ్లు అందులో ఇరుక్కుపోయాయి. ఆ కారు వెంటనే ఆమె కొంత దూరం పరిగెత్తి తన చేతిని వెనక్కిలాక్కుంది. ఈ చర్యనంతా ఆమె టీమ్ వీడియో తీసింది. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై మరోసారి దాడి.. బిహార్‌లో రాళ్లు విసిరేసిన దుండగులు

ఈ ఘటనపై ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిందితుడిని 20 నిమిషాల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఉదయం సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె ట్విట్టర్ వేధికగా పంచుకుంది. ఢిల్లీ మహిళా కమిషన చైర్మన్ అయిన తనకే దేశ రాజధానిలో రక్షణ లేనప్పుడు ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios