జైపూర్ జంతర్ మంతర్‌ను సందర్శించిన మోడీ, మాక్రాన్ .. భారతీయుల మేథాశక్తికి నిదర్శనం ఈ ‘‘సన్ డయల్ ’’
ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించారు. ఈ సోలార్ అబ్జర్వేటరీని మహారాజా సవాయి జై సింగ్ స్థాపించగా, దీనిని 2010 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించారు. ఈ సోలార్ అబ్జర్వేటరీని మహారాజా సవాయి జై సింగ్ స్థాపించగా, దీనిని 2010 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి శతాబ్ధాల ముందే భారతదేశ నైపుణ్యం, శాస్త్రీయ పురోగతికి దీనిని చిహ్నంగా చెబుతారు. ఇది 18 వాయిద్యాల సమితితో ప్రపంచంలోనే అతిపెద్ద రాతి అబ్జర్వేటరీగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ అబ్జర్వేటరీ పలు సాధనాలను సైతం కలిగి వుంది .
లఘు సామ్రాట్ యంత్రంగా పేర్కొనబడే సన్ డయల్.. స్థానిక సమయాన్ని 20 సెకన్ల ఖచ్చితత్వంతో చూపిస్తుంది. ఉత్తర, దక్షిణ దిశలో వుంచిన త్రిభుజాకరా గోడకు ఇరువైపులా చతుర్భుజాలు వుంటాయి. గోడ నీడ చతుర్భుజాలపై సమాన సమయంలో, సమాన దూరంలో కదులుతుంది. ఈ కదలిక స్థానిక సమయాన్ని చదవడానికి వీలు కలిగిస్తుంది. పశ్చిమ, తూర్పు క్వాడ్రాంట్లు వరుసగా ఉదయం, మధ్యాహ్నం విభాగాలకు 6 గంటల చొప్పున ఉప విభాగాలుగా విభజించబడ్డాయి. ప్రతి గంటను నాలుగు పదిహేను నిమిషాల విభాగాలుగా విభజించారు. ఆపై వీటిని ఐదు నిమిషాలు, ఒక నిమిషం విభాగాలుగా విభజించారు. ప్రతి నిమిషం మళ్లీ మూడు విభాగాలుగా విభజించబడుతుంది, అంటే ఒక్కొక్కటి 20 సెకన్లు.
అర్ధగోళాలలో సూర్యుని స్థానాన్ని నిర్ణయించడానికి ఉపయోగించేందుకు సన్ డయల్‌ను ఏర్పాటు చేశారు. దీనిని రెండు భాగాలుగా రూపొందించారు. ఒకటి సూర్యుడు ఉత్తరార్ధ గోళంలో వున్నప్పుడు (మార్చి నుంచి సెప్టెంబర్ వరకు), మరొకటి దక్షిణార్ధ గోళంలో (సెప్టెంబర్ నుంచి మార్చి వరకు) వున్నప్పుడు సూర్యుడిని వర్ణిస్తుంది. ఇనుప రాడ్ (గ్నోమోన్) నీడ జైపూర్ నగర స్థానిక సమయాన్ని చూపుతుంది.
ఖగోళ వస్తువుల ఖగోళ అక్షాంశం, రేఖాంశాలను కొలిచే సాధానాలే రాశి వలయ. రాశి చక్రం 12 సంకేతాలను సూచించేలా 12 సాధనాలు వున్నాయి. రాశిచక్రం సంబంధిత గుర్తు స్థానిక మెరిడియన్‌ను బదిలీ చేసినప్పుడు కొలత జరుగుతుంది. ఈ సాధనాలు ఉత్తర, దక్షిణ అర్ధ గోళంలో సూర్యుని కోణీయ స్థానం ఆధారంగా వుంచబడ్డాయి.
రెండు సెకన్ల ఖచ్చితత్వంతో స్థానిక సమయాన్ని చూపే ప్రపంచంలోనే అతిపెద్ద సన్ డయల్ ఇదే. 27º N స్థానిక అక్షాంశ కోణంతో ఉత్తర, దక్షిణ దిశలో ఉంచబడిన మధ్య గోడ.. గోడ నీడ తూర్పు, పడమర చతుర్భుజాలపై సమాన సమయ వ్యవధిలో సమాన దూరం కదులుతుంది. ఈ కదలిక స్థానిక సమయాన్ని చూపుతుంది.