ఓ వైపు ముందస్తు ఎన్నికల ప్రచారం జరగడంతో ఎన్నికల సంఘం కూడా అందుకు తగ్గట్లు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఈసీ సంకేతాలతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొంతకాలంగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. వాటిని నిజం చేసేలా ఈసీ( ఎన్నికల కమిషన్) కొన్ని సంకేతాలు ఇచ్చింది.

వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను సెప్టెంబర్ వరకు సిద్ధంగా ఉంచాలని నోట్‌లో పేర్కొంది.

2019 ఎన్నికల కోసం గతంలో ఈసీ 16.15 లక్షల వీవీ పాట్స్‌ను తయారీకి ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిని సెప్టెంబర్‌ చివరినాటికి సిద్ధం చేయాలని భెల్‌, ఈసీఐఎల్‌ కంపెనీలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై ఏ ఎన్నికలకైనా ఈవీఎంలకు వీవీపాట్స్‌ యంత్రాలను జత చేయాలని ఈసీ నిర్ణయించింది. 