పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపడితే మొఘల్ పేర్లన్నింటినీ తొలగిస్తాం - ప్రతిపక్ష నేత సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికారంలోకి వస్తే మొఘల్స్ పేరుపై ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటికి పేర్లు మారుస్తామని ఆ పార్టీ నేత సువేందు అధికారి అన్నారు. మొఘలులు అనేక హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని తెలిపారు.
తమ పార్టీ పశ్చిమ బెంగాల్ లో అధికారం చేపడితే మొఘల్ పేర్లతో ఉన్న అన్ని స్థానాలను కనుగొని, వాటి పేర్లను మారుస్తామని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న మొఘల్ గార్డెన్‌కు కేంద్ర ప్రభుత్వం ‘‘అమృత్ ఉద్యాన్’’ అనే పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒడిశా ఆరోగ్య మంత్రిపై దుండగుల కాల్పులు: ఆసుపత్రికి తరలింపు
‘‘ వారు (మొఘలులు) చాలా మంది హిందువులను చంపారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. వారి పేర్లతో ఉన్న అన్ని ప్రదేశాలను గుర్తించి, పేర్లు మార్చాలి. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మేము వారంలో బ్రిటీష్, మొఘల్ పేర్లన్నింటినీ తొలగిస్తాము’’ అని సువేందు అధికారి వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
కాగా.. రాష్ట్రపతి భవన్ ఉద్యానవనాల పేరు మార్చడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ లో అనేక రకాల ఉద్యానవనాలు ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75వ వార్షికోత్సవాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ గౌరవార్థం వాటికి ‘‘అమృత్ ఉద్యాన్’’ అనే పేరును నిర్ణయించారు.
1900లో 89 మంది కాశ్మీరీ హిందువులు మాత్రమే చనిపోయారు, మిగిలిన వారు పారిపోయారు - ఎస్పీ నేత అబూ అజ్మీ
అయితే జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమృత్ ఉద్యానాన్ని ప్రజలు సందర్శించవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ ప్రారంభం కానున్నాయి. ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్ వంటివి రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ లో ఉన్నాయి. హెర్బల్-1, హెర్బల్-2, టచ్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, ఆరోగ్య వనం వంటి మరిన్ని ఉద్యానవనాలు మాజీ రాష్ట్రపతిలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్ హయాంలో ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీలోని అనేక మంది నాయకులు స్వాగతించగా.. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలని సూచించాయి. ‘‘ ఎవరికి తెలుసు. వారు ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ పేరు మార్చి, దానికి మోడీ గార్డెన్స్ అని కూడా పేరు పెట్టొచ్చు. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల విలువైన వనరులను కాపాడుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలి” అని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది.
‘హిందువు’ అంటే మతపరమైన పదం కాదు.. అది భౌగోళిక పదం - కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
ఈ విషయంలో మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ ట్వీట్ చేశారు. ‘‘ ఔరంగజేబు దీనికి పేరు పెట్టాడని ఇది మొఘల్ గార్డెన్ కాలేదు. ఇక్కడి ఫౌంటైన్లు, నీటి కాలువలు చతుర్భుజాలతో మొఘల్ గార్డెన్ శైలిలో ఏర్పాటు చేశారని బ్రిటిష్ వారు దీనికి ఈ పేరు పెట్టారు. దాన్ని మార్చలేం కదా ? ’’ అని పేర్కొన్నారు.