వార్నీ.. కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తైనా తీరు మారకపోవడంతో... అదేం చేసిందంటే..
ఓ కోతికి ఉత్తరప్రదేశ్ లో జీవిత ఖైదు పడింది. ఐదేళ్ల జైలుశిక్షతో దాని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ నిర్షయానికి వచ్చారు జూ అధికారులు.

ఉత్తర్ ప్రదేశ్ : మనిషికి జీవిత ఖైదు విధించడం మనకు తెలుసు.. అయితే ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని ఓ కోతి కూడా ఇలాంటి శిక్షనే అనుభవిస్తోంది. మీర్జాపూర్ లో కాలియా అనే పేరు గల కోతి.. ఓ మాంత్రికుడి వద్ద మద్యం, మాంసాహారానికి అలవాటు పడింది. కొన్నాళ్ల క్రితం ఆ వ్యక్తి మరణించాడు. దాని ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో ఆ వానరం విచక్షణ రహితంగా పురుషులు, మహిళల మీద దాడికి దిగేది. మద్యం దుకాణాల వద్ద తాగుబోతుల నుంచి మందు సీసాలను ఎత్తుకుపోయి తాగేది. ఇలా 250 మంది మీద దాడి చేసింది .
దీంతో 2017లో స్థానికుల ఫిర్యాదుతో అతి కష్టం మీద అటవీ అధికారులు వానరాన్ని బంధించారు. అప్పటి నుంచి జూలో బందీగా ఉంచి మానసిక వైద్యం అందించారు. ఐదేళ్లుగా శిక్ష అనుభవించినా కోతి ప్రవర్తనలో ఎటువంటి మార్పులేదు. దీంతో దాన్ని జీవితాంతం జూలోనే బందీగా ఉంచనున్నట్లు కాన్పుర్ జూ వైద్యుడు నాజర్ పేర్కొంటున్నారు.
భారతావని చరిత్రలో ఎప్పటికీ మానని గాయం.. ఆ ఉగ్రదాడికి 14 ఏండ్లు..
ఇలాంటి విచిత్రమైన ఘటనే ఓ పాము విషయంలో జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. చెప్పును నోట కరుచుకున్న ఓ పాము పరిగెత్తడం కనిపిస్తుంది. ఈ చెప్పుతో ఆ పాము ఏం పనో తెలియదు కానీ.. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు షేర్ చేశారు. ఇప్పుడిది లక్షకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పాము జనావాసాల్లోకి వస్తుంది. అది చూసి వారంతా గట్టిగా కేకలు వేస్తూ.. భయంతో పరుగులు తీస్తుంటారు. ఆ పాము మాత్రం అక్కడున్న ఓ చప్పల్ ను నోట కరుచుకుని పారిపోతుంది. పాము అలా చేయడం ఇప్పటివరకు చూడలేదంటూ ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
‘ఇంత భయపెట్టింది చెప్పు కోసమా.. ఇంతకీ పాముకు కాళ్లే లేవుకదా.. ఈ చెప్పును ఏం చేసుకుంటుంది.. నాకైతే తెలియదు..’అంటూ కామెంట్ పెడుతూ పర్వీన్ కస్వాన్ వీడియోను షేర్ చేశారు. ఇక దీనిమీద కామెంట్ల ప్రహసనం మొదలయ్యింది. అంతేకాదు ఈ వీడియో ఎక్కడ జరిగిందో ప్రాంతం గురించి తెలుసుకోవడానికి అందులోని మనుషులు మాట్లాడే యాసను కూడా ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు.