Asianet News TeluguAsianet News Telugu

భారతావని చరిత్రలో ఎప్పటికీ మానని గాయం.. ఆ ఉగ్రదాడికి 14 ఏండ్లు.. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నవంబర్ 26, 2008న లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన మరణహోమానికి నేటీతో 14 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ ఉగ్రదాడిలో 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఘటనలో ప్రాణాలు దేశ కోల్పోయిన వారి త్యాగాలను కేవలం భారత దేశమే కాదు.. యావత్తు ప్రపంచం గుర్తు చేసుకుంది. అమరులకు నివాళుల్పరిస్తుంది.

Leaders pay homage to victims on 14th anniversary of Mumbai 26/11 attacks
Author
First Published Nov 26, 2022, 10:52 AM IST

ముంబై దాడి 26/11: దేశ ఆర్థిక రాజధానిలో ముంబైలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన మరణహోమానికి సరిగా నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉగ్రదాడి కేవలం నగరాన్నే కాదు. దేశ మొత్తాన్ని కుదిపేసింది. ఈ దాడిలో వందలాది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి దేశంలో ఎప్పడు మాయని మచ్చలా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో పలు దేశ నేతలు అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమరులు నివాళుల్పరించారు. 

ముంబై దాడుల బాధితులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతానం తెలిపింది. 26/11 వార్షికోత్సవం సందర్భంగా..  కోల్పోయిన వారందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటోందని అన్నారు. వారి ఆత్మీయులు, కుటుంబ సభ్యుల బాధలను మేము పంచుకుంటాము. విధి నిర్వహణలో పరాక్రమంగా పోరాడి అత్యున్నత త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి దేశం నివాళులు అర్పిస్తోందని పేర్కొన్నారు. 

భారత విదేశాంగ మంత్రి ఎస్.శంకర్  కూడా 26/11  దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని నివాళులర్పించారు. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పు అని అన్నారు. 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం నివాళులర్పిస్తోంది. యావత్ ప్రపంచం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఈ దాడికి పథకం వేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద బాధితులకు  మా సంతాపం.  అని పేర్కోన్నారు.  

26/11 దాడుల వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయి, సామాన్యులను కాపాడుతూ అత్యున్నత త్యాగం చేసిన అమరవీరులకు నమస్కరిస్తున్నాను. భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి , సామాజిక సామరస్యానికి నాంది పలుకుతోంది, అయితే ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా నిర్మూలించాలని  నిర్ణయించుకున్నాము.


26/11 దాడుల వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులతో పోరాడుతూ అత్యున్నత త్యాగం చేసిన మన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకుంటూ వారికి నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని యావత్ ప్రపంచం నేడు సందేశం ఇస్తుందని అన్నారు. 


ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ భద్రతా మండలిలో మాట్లాడుతూ.. 2008 నవంబర్‌లో 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి సముద్ర మార్గంలో ముంబై నగరంలోకి ప్రవేశించిన విషయాన్ని మనం మరచిపోయాం. వారు 4 రోజుల పాటు నగరాన్ని నాశనం చేశారు. ఈ దాడిలో 26 మంది విదేశీ పౌరులతో సహా 166 మందిని అత్యంత దారుణంగా కాల్చివేశారు. .

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..  26/11 ఉగ్రదాడి "ఎప్పటికీ మానని గాయం" అని , అలాంటి సంఘటన మళ్లీ జరగకుండా  తమ ప్రభుత్వం  కృతనిశ్చయంతో ఉందని అన్నారు.

ముంబై దాడులకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల భారతీయులు నిరసనలు తెలుపనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 26/11 ముంబై ఉగ్రదాడుల 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, భారతీయ ప్రవాసులు లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ ముందు భారీ ప్రదర్శనను నిర్వహించనున్నారు. ప్రపంచాన్ని బెదిరిస్తున్న  ఉగ్రదాడుల అరికట్టాలనే ఉద్దేశంతో ఈ  నిరసన ప్రదర్శనలు చేసినట్టు తెలుస్తోంది. 

ఎన్‌ఆర్‌ఐలు పాకిస్తాన్ హైకమిషన్‌లో ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఆన్‌లైన్ గ్రూప్ అయిన ఇండిక్ సొసైటీ, "ఈ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని రాష్ట్ర విధానంగా మరియు వ్యూహంగా ఉపయోగించడమే కాకుండా ఉగ్రవాదాన్ని రాష్ట్ర విధానంగా కూడా ఉపయోగించే ఏకైక దేశం పాకిస్తాన్. ఇతర సార్వభౌమాధికారుల వ్యూహం దేశాలను దెబ్బతీస్తుంది." భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థానీ సాయుధ బలగాలు భారీగా సాయుధ ఉగ్రవాదులను ఎలా విడుదల చేస్తున్నాయో కూడా ఈ బృందం హైలైట్ చేస్తుంది.

26/11 2008న అసలేం జరిగింది?

నవంబర్ 26, 2008న 10 మంది సాయుధ ఉగ్రవాదులు సముద్రం ద్వారా ముంబైకి చొరబడి, ప్రసిద్ధ తాజ్ హోటల్‌తో సహా అనేక ప్రదేశాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మందిని చంపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరమైన దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. తాజ్ హోటల్, ది ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా, సెయింట్ జేవియర్స్ కాలేజీ వెనుక లేన్‌లపై ఉగ్రవాదులు దాడి చేశారు. లష్కర్ ఉగ్రవాదులు తాజ్ హోటల్,ఒబెరాయ్ వద్ద ప్రజలను బందీలుగా పట్టుకున్నారు. ఈ ఉగ్ర ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఒబెరాయ్ ట్రైడెంట్‌పై ముట్టడి నవంబర్ 28న ముగిసింది. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2018 మార్చి 12న పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios