బిహార్ సీఎం నితీశ్ కుమార్ మందుబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుతాగే వారంతా మహాపాపులు అని పేర్కొన్నారు. అంతేకాదు, అసలు మహాత్మా గాంధీని అనుసరించిన వీరంతా భారతీయులే కాదని విరుచుకుపడ్డారు. ఆయన రాష్ట్ర శాసన మండలిలో బుధవారం మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార బుధవారంనాడు రాష్ట్ర శాసన మండలిలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుతాగే వారు మహాపాపులు అని అన్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి వారు అసలు భారతీయులే కాదని పేర్కొన్నారు. బిహర్‌లో మద్యపాన నిషేధ చట్టంలో ప్రతిపాదించిన సవరణ గురించి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చలో భాగంగా ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణ అమల్లోకి వస్తే.. తొలి సారి మద్యం తాగేవారిని జరిమానా విధించి వదిలేస్తారు.

మందుతాగిన నేరానికి కేసులు ఎదుర్కొని, జైళ్లపాలు అయిన వారిని విడిచి పెట్టాలని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. వారిని విడుదల చేయడం కాదు.. వారిని తాను మహాపాపులని పిలుస్తారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. మహాత్మా గాంధీని అనుసరించినవారిని హిందుస్తానీలు అనడం కూడా సరికాదని అన్నారు. వారంతా అసమర్థులు అని తెలిపారు.

అంతేకాదు, ఇక నుంచి మందు కల్లు తాగి మందుబాబులు మరణిస్తే.. వారి కుటుంబానికి ఎలాంటి పరిహారం అందబోదని సీఎం ప్రకటించారు. అలాంటి కుటుంబాలకు తాము ఎలాంటి పరిహారం అందించబోమని స్పష్టం చేశారు. అయితే, ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత లిక్కర్ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇటీవలే సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన సేవనానికి వ్యతిరకంగా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు.

గడిచిన ఆరు నెలల్లో బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఐదారు ఘటనల్లో కనీసం 60 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంపూర్ణ Prohibition of alcohol అమలులో ఉన్న State of Biharలో Adulterated alcohol తాగి ఐదుగురు మరణించారు. బీహార్లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఐదుగురు deathపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బీహార్లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం Nitish Kumar దర్యాప్తునకు ఆదేశించారు. కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం నితీష్ కుమార్ పై విమర్శ లకు దిగారు. 

మిత్రపక్షమైన BJP కూడా సీఎంపై ధ్వజమెత్తింది. మద్యనిషేధ చట్టం పూర్తిగా విఫలమైనందున దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు. మద్యనిషేధం చట్టాన్ని కఠినంగా అమలు చేయని అధికారులే డబ్బులు దండుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బీహార్ లో కల్తీ మద్యం వల్ల మరణాలకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆర్జెడి అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ కోరారు.