Asianet News TeluguAsianet News Telugu

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి అఖిలేశ్ యాదవ్ ఫార్ములా.. విపక్ష కూటమిపైనా వ్యాఖ్యలు

2024 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీని ఓడించవచ్చునని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇందుకు వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలపై దృష్టి పెట్టుకోవాలని వివరించారు. యూపీలో 80 మందిని ఓడించడమే నినాదంగా పెట్టుకోవాలని చెప్పారు.
 

akhilesh yadav formula to defeat bjp in 2024 general elections kms
Author
First Published Jun 17, 2023, 3:11 PM IST

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్నది. కాబట్టి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నది. ప్రతిపక్షాలు బీజేపీ పాలసీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నది. ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఏకమై బీజేపీని గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ కీలక రాష్ట్రం. మన దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 80 స్థానాలున్న ఈ రాష్ట్రంలో విపక్ష పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జనరల్ ఎలక్షన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి అఖిలేశ్ యాదవ్ ఓ ఫార్ములాను చెప్పారు.

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే పీడీఏ (పిచ్లే, దళిత్, అల్పసంఖ్యాక్) చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీల పై దృష్టి పెడితేనే ఎన్‌డీఏను ఓడించవచ్చు అని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు తాము ఇచ్చి నినాదం ఒకటే అని.. ‘80 మందిని ఓడించాలి, బీజేపీని తొలగించాలి’ అని తెలిపారు.

Also Read: ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలు?.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి సమాధానం ఇదే

పెద్ద జాతీయ పార్టీలు తమకు (సమాజ్ వాదీ పార్టీకి) మద్దతు ఇస్తే యూపీలో 80 లోక్ సభ స్థానాల్లో బీజేపీని ఓడించవచ్చునని వివరించారు. నిర్దేశిత రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదో కనుక్కుని అందుకు అనుగుణంగా ఆ పార్టీకి సీట్లను కేటాయించాలని తెలిపారు.

సమాజ్ వాదీ పార్టీ గతంలో కాంగ్రెస్, బీఎస్పీలతో కూటమి పెట్టుకున్నదని వివరించారు. తాము కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో అభ్యంతరాలు పెట్టుకోమని తెలిపారు. తమతో కూటమిలో ఏ పార్టీ ఉన్నా.. సీట్లు సర్దుబాటు గురించి పంచాయితీ, బెదిరింపులు ఉండవని వివరించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విజయ దుందుభి మోగించాలంటే.. ప్రతిపక్ష పార్టీలు మనస్సు పెద్దది చేసుకోవాలని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios