అక్బర్ గొప్పోడు కాడు.. ఓ రేపిస్ట్ - రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
మొఘల్ చక్రవర్తి అక్బర్ ఎప్పుడూ గొప్ప వ్యక్తి కాడని, ఆయన ఓ రేపిస్ట్ (Akbar A Rapist) అని రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ (Rajasthan Education Minister Madan Dilawar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బర్ అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడేవాడని ఆరోపించారు.
రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ను రేపిస్టుగా అభివర్ణించారు. ఆయన జీవితాన్ని పాఠశాల పుస్తకాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘అక్బర్ ఎప్పుడూ గొప్ప వ్యక్తి కాదు. ఆయన ఓ దురాక్రమణదారుడు. రేపిస్ట్. బజారుల నుంచి అమ్మాయిలను పిలిపించి అత్యాచారానికి పాల్పడేవాడు. అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తిగా పిలవడం మూర్ఖత్వం’’ అని ఆయన మీడియాతో అన్నారు.
వివాదాస్పద నేత, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూత..
పాఠశాల పాఠ్య పుస్తకాల్లో వస్తున్న మార్పులపై చర్చ సందర్భంగా రాజస్థాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కఠినమైన హిందూ అభిప్రాయాలను వెల్లడించే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ గతంలో కూడా సిలబస్ ను మార్చాలనుకోవడం లేదని, కానీ పాఠ్యపుస్తకాల్లోని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని చెరిపేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
‘‘వీర్ సావర్కర్, శివాజీ వంటి మన పూర్వీకుల గురించి చాలా తప్పుడు సమాచారం ఉంది. వాటినన్నింటినీ సరి చేస్తాం’’ అని ఆయన గత నెలలో మీడియా సమావేశంలో అన్నారు. రాజస్థాన్ పాఠశాలల్లో సూర్యనమస్కారాలను తప్పనిసరిగా నిర్వహించడంపై ఆయన స్పందించారు. దీనిని క్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
క్రీడలపై వైసీపీ క్రీనీడలు.. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్ - వైఎస్ షర్మిల
ప్రస్తుతానికి అది ప్రారంభమైందని, మరి కొద్ది రోజుల్లో అన్ని పాఠశాలల్లో సూర్యనమస్కారాలు నిత్యకృత్యం కానున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై మీడియా మంత్రిని ప్రశ్నించినప్పుడు.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని దిలావర్ అన్నారు. పరీక్షలు ముగియగానే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.