కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరారు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్.

రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని ఆయన అధ్యక్షుడిని కోరారు. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బాదల్ రాష్ట్రపతిని అభ్యర్ధించారు.

Also Read:రాజ్యసభలో విపక్షాల నిరసనలు: వ్యవసాయ బిల్లులకు ఆమోదం

వ్యవసాయానికి సంబంధించి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీస్ బిల్లుకు ఆదివారం పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ సింగ్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు.