ముంబై: ఎన్సీపీ పార్టీ నుండి అజిత్ పవార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదలయ్యింది. ఎన్సీపీ ఎల్పీ లీడర్ గా కూడా అజిత్ పవార్ ని తొలగించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నేటి ఉదయమే శరద్ పవార్ ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్ నిర్ణయం తన వ్యక్తిగతమని, ఆ నిర్ణయంతో తనకు గానీ, తన పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. 

ఇకపోతే అజిత్ పవార్ చెల్లెలు, శరద్ పవార్ కూతురు సుప్రియ సులే వాట్సాప్ స్టేటస్ లో కుటుంబం, పార్టీ రెండూ చీలిపోయాయి అని తన మనసులోని ఎం,ఆటను పంచుకున్నారు. 

ఎన్సీపీ కార్యాలయం వద్ద హై డ్రామా నడుస్తుంది. ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. శివ సేన పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది 

అజిత్ పవార్ సస్పెన్షన్, ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, నిజంగానే శరద్ పవార్ కు ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా కనపడుతుంది. మరో అంశమేమిటంటే, అజిత్ పవార్ కు శివసేనతోని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదటి నుండి కూడా ఇష్టం లేదు. 

ఇకపోతే, ఎన్సీపీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చారని బిజెపి చెబుతోంది. అయితే, అందులో నిజం లేదని శరద్ పవార్ అంటున్నారు. బిజెపికి మద్దతు తెలియజేయాలనేది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఎన్సీపికి సంబంధం లేదని ఆయన అన్నారు. 

శివసేనకు మద్దతు ఇస్తూ ఎమ్మెల్యేల సంతకాలతో సేకరించిన లేఖలను దుర్వినియోగం చేశారని ఎన్పీపి ేత నవాబ్ మాలిక్ అంటున్నారు. అజిత్ పవార్ తమ పార్టీని వెనక నుంచి పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు 

Also Read: పవార్ జి... మీరు గొప్పవారయ్యా: కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి

రాత్రి 9 గంటల వరకు ఆ మహాశయుడు తమతో కూర్చుకున్నాడని, చర్చల్లో పాల్గొన్నారని, అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడని, మాట్లాడుతున్నప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయాడని, ఫోన్ మీద అందుబాటులోకి రాలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.