ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్.. 10జీబీ డేటా

Airtel Rs 597 long-term recharge plan offers unlimited voice calls, 10GB data for 168 days
Highlights

మరో లాంగ్ టర్మ్ ప్లాన్

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్... మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇతర టెలికాం సంస్థలు జియో, బీఎస్ఎన్ఎల్ లకు పోటీగా సరికొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే ఎక్కువగా చేసుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. 


ఇందులో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 168 రోజులుగా నిర్ణయించారు. వాయిస్ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునేవారి కోసం ఈ లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టామని, అందుకనే మొబైల్ డేటాను ఇందులో తక్కువగా ఇవ్వడం జరుగుతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 

ఇప్పటికే జియో రూ. 999, బీఎస్‌ఎన్ఎల్ రూ. 786 రీచార్జి లాంగ్ టైమ్ ప్లాన్లతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు ప్లాన్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఎయిర్‌టెల్ తీసుకువచ్చిన ఈ ఆఫర్‌తో జియోకు బీఎస్ఎన్ఎల్‌కు గట్టి పోటీ ఉంటుందని బిజినెస్ పండితులు అంటున్నారు. ప్రస్తుతం రూ.995 ప్యాక్‌తో ఎయిర్‌టెల్ లాంగ్-టెర్మ్ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాగా ప్రస్తుతం తీసుకువచ్చిన రూ.597 ప్లాన్ రెండో పెద్ద లాంగ్-టెర్మ్ ప్లాన్.

loader