ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో సూపర్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇప్పటికే పలు ప్రీపెయిడ్‌ ప్లాన్ల సమీక్షలతో కస‍్టమర్లను  తనవైపు తిప్పుకుంటున్న ఎయిర్టెల్‌ తాజాగా మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  రూ.558 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై కస్టమర్లకు  భారీ డేటా  ప్రయోజనాలను అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులు జియో, వోడాఫోన్‌లకు పోటీగా తాజా రీచార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ.558 ప్లాన్‌లో   3జీబీ డేటాను రోజువారీ అందిస్తుంది.  వాలిడిటీ 82రోజులు.  అంటే ఈ ప్లాన్ రీచార్జ్‌ ద్వారా వినియోగదారుడు మొత్తం 246 జీబీ డేటానువాడుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాలింగ్‌ సదుపాయం, 100 ఎస్‌ఎంఎస్‌లను  కూడా ఆఫర్‌ చేస్తోంది. కాగా ఇటీవలి కాలంలో   ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ప్లాన్లను సవరించుకుంటూ వ‍స్తోంది.  జియో, వోడాఫోన్‌లాంటి   రీచార్జ్‌ ప్లాన్లను ధీటుగా తన ప్రీపెయిడ్‌ప్లాన్ల రివ్యూ చేపడుతూ డబుల్‌ డేటా అఫర్‌ చేస్తున​ సంగతి తెలిసిందే.