Asianet News TeluguAsianet News Telugu

డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఈ నెల 25 నుండి అనుమతి: ప్రయాణీకులకు సూచనలు ఇవే.....


ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ తరుణంలో ప్రయాణీకులకు గురువారం నాడు మధ్యాహ్నం కేంద్ర విమానాయాన శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

 

Airport Authority of India Releases New Guidelines For Domestic Flights From May 25
Author
New Delhi, First Published May 21, 2020, 1:45 PM IST


న్యూఢిల్లీ: ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ తరుణంలో ప్రయాణీకులకు గురువారం నాడు మధ్యాహ్నం కేంద్ర విమానాయాన శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రతి ప్రయాణీకుడు ముఖానికి మాస్క్ ను దరించాలని సివిల్ ఏవియేషన్ శాఖ స్పష్టం చేసింది. ప్రతి ప్రయాణీకుడు మాస్కులు ధరించారో లేదా విమానాయాన సిబ్బంది పరిశీలించనున్నారుజ

ప్రతి ప్రయాణీకుడు ఆరోగ్య సేతు యాప్ ను తమ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి. 14 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవడాన్ని మినహయించారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రయాణీకుడి ఆరోగ్య సమాచారం తెలిసే అవకాశం లేకపోతే అతడిని విమానం  ఎక్కేందుకు అనుమతించరు.

ఎయిర్ పోర్టులోకి వచ్చే సమయంలోనే ప్రతి ఒక్క వస్తువు శానిటేషన్ చేయనున్నారు.ప్రతి ప్రయాణీకుడు ఎయిర్ పోర్టుకు కనీసం రెండు గంటల ముందు చేరుకోవాలని విమానాయాన మంత్రిత్వశాఖ తెలిపింది.విమానాశ్రయానికి నాలుగు  గంటల ముందుగానే ప్రయాణీకులు చేరుకొన్నా కూడ వారిని అనుమతించరు. నిర్ధేశించిన రెండు గంటలకు ముందే అనుమతివ్వనున్నారు.

also read:ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లు, థర్మల్ కెమెరాలు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాగ్రత్తలు

ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. లగేజీని తీసుకొనే చోటు వద్ద భౌతిక దూరం పాటించే విధంగా సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్టుల్లోని పలు ప్రాంతాల్లో  హ్యాండ్ శానిటేషన్ ను అందుబాటులో ఉంచనున్నారు.

వాష్‌రూమ్ , ప్రయాణీకులు తిరిగే చోటు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగ్, డోర్లు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు వంటి వాటిని విమానం వచ్చే ముందు తర్వాత కూడ శానిటేషన్ చేయాలని కేంద్ర విమానాయానశాఖ ఆదేశించింది.ఎయిర్ పోర్టు నుండి ప్రయాణీకులను పికప్, డ్రాపింగ్ కోసం ఎంపిక చేసిన ప్రైవేట్ కారు ఆపరేటర్లను మాత్రమే అనుమతించనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios