Asianet News TeluguAsianet News Telugu

ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లు, థర్మల్ కెమెరాలు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాగ్రత్తలు

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాలను నడపనున్నట్టుగా సివిల్ ఏవియేషన్ శాఖ ప్రకటించిన  విషయం తెలిసిందే.
 

Hyderabad airport all set for post-lockdown reopening with safety measures to protect flyers
Author
Hyderabad, First Published May 21, 2020, 10:45 AM IST

హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాలను నడపనున్నట్టుగా సివిల్ ఏవియేషన్ శాఖ ప్రకటించిన  విషయం తెలిసిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి విమాన రాకపోకలను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తెలంగాణలో కూడ విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో విమాన రాకపోకలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోకి వచ్చే మార్గంతో పాటు ఎయిర్ పోర్టు నుండి బయటకు వెళ్లే మార్గంలో ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లను ఏర్పాటు చేశారు.

also read:బ్రేకింగ్: ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

ప్రయాణీకుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం టెక్నాలజీ సహాయం తీసుకోనున్నారు. గతంలో మాదిరిగా మాన్యువల్ పద్దతిలో కాకుండా కాంటాక్ట్ లెన్స్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అనుమానితులనను గుర్తించేందుకు ధర్మల్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.ప్రయాణీకుల లగేజీని శానిటేషన్ చేసిన తర్వాతే అందించనున్నారు. 

లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకొన్న ఇండియన్లను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు శంషాబాద్ కు చేరుకొన్నాయి. హైద్రాబాద్ లో చిక్కుకొన్న అమెరికన్లను ప్రత్యేక విమానం ద్వారా  ఇదే విమానాశ్రయం నుండి పంపారు. సాధారణ ప్రయాణీకులకు మాత్రం ఈ నెల 25వ తేదీ నుండి విమానాలను నడవనున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios