ఎయిరిండియాలో మహిళా ఉద్యోగికి వేధింపుల పర్వం ఎదురైంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల మహిళా పైలట్.. ఓ సీనియర్ కెప్టెన్ కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమం అనంతరం సదరు కెప్టెన్ .. మహిళా పైలట్‌ను రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళదామని ఆహ్వానించారు.

గతంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమె అతని ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే రెస్టారెంట్‌కు వెళ్లిన తర్వాత కెప్టెన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

‘మీరు మీ భర్తకు దూరంగా ఉండగలుగుతున్నారా..? అంటూ ద్వంద్వార్ధాలు వచ్చేలా మాట్లాడాడు. అతని వేధింపులు భరించలేదని ఆమె క్యాబ్ మాట్లాడుకుని వెళ్లిపోయింది. అనంతరం ఈ ఉదంతంపై ఆమె యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా కెప్టెన్‌పై విచారణ చేపట్టింది.