Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ హోస్టెస్ హత్య కేసులో ఊహించని పరిణామం.. లాకప్‌లో నిందితుడి ఆత్మహత్య..

మహారాష్ట్ర ముంబైలో ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు విక్రమ్ అత్వాల్‌ అంధేరీ పోలీసు స్టేషన్‌లోని లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Air hostess murder case Accused hangs self inside lock-up in Mumbai Police station ksm
Author
First Published Sep 8, 2023, 1:29 PM IST | Last Updated Sep 8, 2023, 1:29 PM IST

మహారాష్ట్ర ముంబైలో ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు విక్రమ్ అత్వాల్‌ అంధేరీ పోలీసు స్టేషన్‌లోని లాకప్‌లో ప్యాంటుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం అంధేరి పోలీసు స్టేషన్ లాకప్‌లోని టాయిలెట్‌లోకి ప్రవేశించిన నిందితుడు ఎన్నిసార్లు పిలిచిన స్పందించకపోవడాన్ని గమనించిన అధికారులకు అనుమానం వచ్చింది. ఈ క్రమమంలోనే తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు.

ముంబైలోని ముంబైలోని మరోల్ ఏరియాలోని తన ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే‌ను గొంతు కోసి హత్య చేసినందుకు నిందితుడు విక్రమ్ అత్వాల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి  తెలిసిందే. ఇక, అతడికి విధించిన మూడు రోజుల పోలీసు కస్టడీ పూర్తయిన తర్వాత శుక్రవారం అంధేరీ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.

వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిరిండియాకు ఎంపికైంది. ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ముంబైకి వచ్చింది. ముంబైలోని అంధేరిలోని ఒక హౌసింగ్ సొసైటీలో తన సోదరి, మరో ఫ్రెండ్‌తో కలిసి రూపాల్ నివాసం ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం వారిద్దరు వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో ఫ్లాట్‌లో రూపాల్ ఒంటరిగా ఉంటుంది. బాధితురాలు చివరిసారిగా ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడింది. అయితే ఆ తర్వాత రూపాల్ కుటుంబ సభ్యుల ఫోన్‌లు ఎత్తకపోవడంతో.. వారు ముంబైలోని ఆమె స్నేహితులను సంప్రదించారు. దీంతో వారు రూపాల్ నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. లాక్ చేసి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాల్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రూపాల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. 

ఈ కేసును విచారించిన పోలీసులు.. హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్‌ను అరెస్ట్ చేశారు. అతడు రూపాల్‌ను హత్య చేసినట్టుగా  నిర్దారణకు వచ్చారు. ‘‘మహిళను భయపెట్టి, ఆమెపై దాడి చేయడమే తన ఉద్దేశ్యమని అత్వాల్ ఒప్పుకున్నాడు. అయితే..ఆమె అతనితో పోరాడడంతో మెడపై రెండుసార్లు కత్తితో పొడిచాడు’’ అని అత్వాల్ అరెస్ట్ తర్వాత పోలీసులు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios