రామభక్తుడిగా అసదుద్దీన్ ఓవైసి ... రామనామ స్మరణ తప్పదు..: విహెచ్‌పి నేత సంచలనం
చివరకు హైదరాాబాద్ ఎంపీ, ఎంఎంఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కూడా రామనామ స్మరణ చేస్తూ భక్తుడిగా మారిపోతారని విహెచ్‌పి నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసారు.
డిల్లీ : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేసారు. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి ప్రస్తుత రామమందిరం నిర్మాణం వరకు అంతా ఓ క్రమ పద్దతిలో జరిగిందని అన్నారు. చివరకు ముస్లింలు 500 ఏళ్లుగా ప్రార్థనలు చేసిన బాబ్రీ మసీదును స్వాధీనం చేసుకుని ఆలయాన్ని నిర్మించారని అన్నారు. భారతీయ ముస్లింల నుండి బాబ్రీమసీదును లాక్కున్నారని అసదుద్దీన్ అన్నారు.
అయోధ్య రామమందిరం నిర్మించిన స్థలం ముస్లింలదే అనేలా మాట్లాడిన ఎంఐఎం అధినేతకు విశ్వహిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ భన్సల్ కౌంటర్ ఇచ్చారు. 500 ఏళ్ళ చరిత్ర బాబ్రీ మసీదుది అంటున్నావే... మరి మీ పూర్వీకులు ఎవరైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. లండన్ లో న్యాయవిద్య చదివారుగా... మరి మీరెందుకు మసీదు కోసం కోర్టులను వెళ్లలేదు? అని నిలదీసారు. రామమందిర ప్రారంభోత్సవ సమయంలోనే ఈ స్థలం ముస్లిందని అనడం ముమ్మాటికీ రాజకీయాలకోసమే అని వినోద్ భన్సల్ ఆరోపించారు.
Also Read Ayodhya Ram Mandir : దెబ్బతిన్న జాతీయ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ప్రతీక : సద్గురు వ్యాఖ్యలు
త్వరలోనే అసదుద్దీన్ ఓవైసితో సహా ఎంఐఎం నాయకులంతా రామ భక్తులుగా మారతారని విహెచ్‌పి నేత సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎంఐఎం పార్టీకి చెందినవారంతా రామనామ స్మరణ చేసే రోజులు దగ్గర్లోనే వున్నాయని విహెచ్‌పి జాతీయ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేసారు.