న్యూఢిల్లీ: కరోనా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాంకేతిక విద్యతో పాటు, వృృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన విద్యా సంస్థలను ఈ ఏడాది సెప్టెంబర్ 15న ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నాయి.

దేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల విద్య సంవత్సరాన్ని సెప్టెంబర్ 15 నుండి ప్రారంభించనుంది. ఈ మేరకు గురువారం నాడు  అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసీటీఈ) గురువారం నాడు విద్యా సంవత్సరం కాలెండర్ ను విడుదల చేసింది.

గతంలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు చేర్పులు చేసింది. గతంలో విడుదల చేసిన విద్యా సంవత్సరంలో సెప్టెంబర్  ఒకటవ తేదీన, ఇతర విద్యార్థులకు ఆగష్టు ఒకటో తేదీన తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

also read:జేఈఈ, నీట్ పరీక్షలపై రేపటిలోపుగా నివేదిక: హెచ్ఆర్‌డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో విద్యా సంవత్సరంలో మార్పులు చేర్పులు చేసింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని ప్రకటించింది.

పాత విద్యార్థులకు ఈ ఏడాది ఆగస్టు 16 నుండి  తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్‌ 30 వరకు ఇవ్వాలని పేర్కొంది.

 కానీ ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్‌ 15లోగా పూర్తి చేయాలని సూచించింది. పీజీసీఎం,పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని సాంకేతిక విద్యా మండలి తెలిపింది.