న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ మధ్య జరగాల్సిన జేఈఈ , ఈ నెల 26 జరగాల్సిన నీట్ పరీక్షలపై రేపటిలోపుగా నివేదికను సమర్పించాలని ఎన్‌టీఏను ఆదేశించినట్టుగా కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ తెలిపారు.

కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు.

also read:గుడ్‌న్యూస్: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు మార్చుకొనే ఛాన్స్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయా లేవా అనే విషయమై పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయమై 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంంలో ఉన్నారని మంత్రి చెప్పారు. ట్విట్టర్ వేదికగా రిప్ ఎన్‌టీఏ పేరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హ్యాష్ ట్యాగ్  ట్రెండ్ చేస్తున్నారు. గత 24 గంటల్లో 314800 మంది ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ పై హెచ్ఆర్‌డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ స్పందించారు. మీ సమస్యను అర్ధం చేసుకొన్నానని ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఈ సమస్యకు ఓ పరిష్కారం కొనుగొనేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన వివరించారు.  ఈ పరీక్షల నిర్వహణ విషయమై రేపటిలోపుగా నివేదిక ఇవ్వాలని ఎన్‌టీఏ, ఇతర నిపుణుల కమిటిని కోరినట్టుగా ఆయన తెలిపారు.