తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే ఉండటం  గమనార్హం.

సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వే షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. థెన్ మొళిలకు తొలి జాబితాలో స్థానం లభించింది.

తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగిలిన అభ్యర్థులను మరికొన్నిరోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.

ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..

పళనిస్వామి- ఎడప్పాడి (సేలం జిల్లా)
పన్నీర్ సెల్వం- బోధినాయకన్నూర్ (థేని జిల్లా)
డి.జయకుమార్- రాయపురం
వే షణ్ముగం- విల్లుపురం
ఎస్పీ షణ్ముగనాథన్- శ్రీవైకుంఠం
ఎస్.థేన్ మొళి- నీలక్కొట్టాయ్

కాగా, తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయడానికి ప్రముఖ సినీనటీనటులు సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే తరఫున, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తరపున, జాతీయ పార్టీ బీజేపీ టికెట్టుపై పోటీ చేయడానికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తు న్నారు. మునుపెన్నడూలేని విధంగా ఈసారి శాసనసభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సినీ తారలు పోటీ చేయడా నికి సిద్ధపడుతుండడం విశేషం.