Asianet News TeluguAsianet News Telugu

డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించిన పళనిస్వామి

డీఎంకే ప్రభుత్వ పాలన లోపభూయిష్టంగా ఉన్నదని ఏఐఏడీఎంకే నిరాహార దీక్ష ప్రారంభించింది. కోయంబతూర్‌లో ఏఐఏడీఎంకే మధ్యంతర జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం ఈ దీక్షను ప్రారంభించారు.
 

aiadmk fasting protest against dmk poor governance in coimbatore started by palaniswami
Author
First Published Dec 2, 2022, 7:05 PM IST

చెన్నై: డీఎంకే పార్టీ ప్రభుత్వం పరిపాలన లోపభూయిష్టంగా ఉన్నదని పేర్కొంటూ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నిరాహార దీక్ష ప్రారంభించింది. మాజీ సీఎం, ఏఐఏడీఎంకే మధ్యంతర జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి కే పళనిస్వామి సారథ్యంలో శుక్రవారం కోయంబతూర్‌లో ఈ దీక్షను మొదలు పెట్టింది.

డీఏంకే పాలన లోపభూయిష్టంగా ఉన్నదని ఏఐఏడీఎంకే ఆరోపించింది. కోయంబతూర్‌లో రోడ్లు సరిగా లేవని, ఇటీవలే కురిసిన వర్షాలకు ఈ రోడ్లు మరింత బాగు లేకుండాపోయాయని పేర్కొంది. దీంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ హైక్, ఎలక్ట్రిసిటీ టారిఫ్‌లు, ప్రభుత్వ హాస్పిటళ్లలో మెడిసిన్ కొరత వంటి సమస్యలపైనా ఏఐఏడీఎంకే దృష్టి పెట్టింది. 

కోయంబతూర్‌లో నిరాహార దీక్ష‌ ఎస్పీ వేలుమణి సారథ్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి ప్రారంభించారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో మెడిసిన్ కొరత ఉన్నదని, దానిపై ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ, దీని గురించి సీఎం స్టాలిన్ ఏమాత్రం ఆందోళన చెందడం లేదని వివరించారు.

Also Read: తక్షణమే గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరిన డీఎంకే

అంతకు ముందు పళనిస్వామి మాట్లాడుతూ, మార్నింగ్ వాక్ చేస్తుండగా సీఎం స్టాలిన్ తన కొడుకు సినిమా కలహా తలైవాన్ ఎలా నడుస్తున్నదని అడిగాడని, అందుకు హెల్త్ మినిస్టర్ సమాధానం ఇచ్చారని ఆరోపించారు. సినిమా థియేటర్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదని, అంటే షో బాగానే నడుస్తున్నదని అనుకున్నారని వివరించారు. రాష్ట్రానికి ఇది ముఖ్యమైన విషయమేనా? అని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios