కేంద్ర ప్రభుత్వం మంగళవారం లాంచ్ చేసిన అగ్నిపథ్ స్కీమ్ కింద రాబోయే 90 రోజుల్లో మొదటి రిక్రూట్ మెంట్ స్కీమ్ ఉంటుందని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్పష్టం చేశారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక ఏడాది తరువాత తమ బెటాలియన్ లో ఉంటారని చెప్పారు.

రాబోయే 90 రోజుల్లో అగ్నిప‌థ్ స్కీమ్ కింద తొలి రిక్రూట్ మెంట్ ర్యాలీ జ‌రుగుతుంద‌ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు అన్నారు. అగ్నిప‌థ్ స్కీమ్ ను ప్రశంసించిన ఆయ‌న ఇది భారత్ భవిష్యత్ యుద్ధాలతో పోరాడటానికి సిద్ధంగా ఉందని నిర్ధారిస్తోంద‌ని అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ ను కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇండియ‌న్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల స‌మ‌క్షంలో మంగ‌ళ‌వారం లాంచ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జనరల్ బీఎస్ రాజు మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వ మరో కీలక నిర్ణయం.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి ఓకే.. 4జీ కంటే పదిరెట్లు వేగవంతమైన సేవలు

‘‘ ఇప్పటి నుండి 90 రోజుల తరువాత రిక్రూట్ మెంట్ ర్యాలీ ఉంటుంది. అంటే సుమారు 180 రోజుల త‌రువాత రిక్రూట్ మెంట్ లో సెలెక్ట్ అయిన అభ్య‌ర్థులు మా ట్రైనింగ్ సెంట‌ర్ లో ఉంటారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత మా బెటాలియన్లలోకి మొద‌టి బ్యాచ్ అగ్నివీర్ లు వ‌చ్చి ఉంటారు. ’’ అని ఆయ‌న అన్నారు. ఈ నియామకాలు పాన్-ఇండియా మొత్తంలో జ‌రుగుతాయ‌ని అన్నారు. ఇందులో ఎంపికైన వారంద‌రికీ ఆరు నెలల శిక్షణ ఉంటుంద‌ని అన్నారు. ఆ తర్వాత వారు 3.5 సంవత్సరాలు పనిచేస్తార‌ని చెప్పారు. నాలుగో సంవ‌త్స‌రం చివ‌రిలో 25 శాతం మందిని సైన్యంలో ఉంచుకుంటామ‌ని తెలిపారు. మిగిలిన 75 శాతం మందిని బ‌య‌ట‌కు విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. 

శుక్ర‌వారం రాళ్లు రువ్వితే.. శ‌నివారం బుల్డోజ‌ర్లు వ‌స్తాయ్ - బీజేపీ ఎంపీ సాక్షి మ‌హారాజ్

‘‘అగ్నిపథ్ పథకం ద్వారా దేశభక్తులు, యువత సాయుధ దళాల్లో నాలుగు సంవత్సరాల పాటు సేవలందించవచ్చు. ఈ పథకం కింద నియమితమైన సైనికులను అగ్నివీర్లు అని పిలుస్తారు. వీరు త్రివిధ దళాలలో ఒక ప్రత్యేక హోదాగా ఉంటారు. యూనిఫారంలో భాగంగా ఒక నిర్దిష్ట చిహ్నాన్ని ధ‌రిస్తారు ’’ అని తెలిపారు. ప్రస్తుత భారత సైనికుల సగటు వయస్సు సుమారు 32-33 సంవత్సరాలు ఉంది. అయితే ఈ అగ్నిప‌థ్ స్కీమ్ అమ‌లు వ‌ల్ల ఒక దశాబ్దంలో సైనికుల వ‌య‌సు 26 సంవత్సరాలకు తగ్గుతుంద‌ని అన్నారు. ‘‘ ఇది ఆర్మీని ఫిట్టర్ చేస్తుంది. దళాలు పనిచేసే క్లిష్టమైన ప్రాంతాల్లో మరింత సవాలుతో కూడిన పరిస్థితులను మేము నిర్వహించగలుగుతాము’’ అని ఆయన వివరించారు.

కేర్ టేకర్ పైశాచికత్వం.. రెండేళ్ల చిన్నారికి చిత్రహింసలు.. వీడియో వైరల్...

అగ్నిపథ్ స్కీమ్ వల్ల భారతీయ సైన్యానికి సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుందని జనరల్ బీఎస్ రాజు అన్నారు. ‘‘ సాంకేతిక ఆయుధాల కోసం, భారత సైన్యానికి అవసరమైన నైపుణ్యాల సెట్లలో ఇప్పటికే అర్హత సాధించిన వ్యక్తులను నియమించడానికి మేము ఎదురు చూస్తున్నాము. ఐటీఐ, పాలిటెక్నిక్ ల వనరులను మేము ఉపయోగించుకుంటాం. తద్వారా మేము వారిని సైన్యంలోకి తీసుకువచ్చినప్పుడు వారికి శిక్షణ ఇచ్చే అవసరం కొంత మేరకు తగ్గుతుంది’’ అని ఆయన అన్నారు.