తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ యూపీ సర్కార్ చేస్తున్న బుల్డోజర్ చర్యలను సమర్థించారు. శుక్రవారం అల్లర్లకు పాల్పడితే శనివారం బుల్డోజర్లు తప్పక బయలుదేరుతాయని హెచ్చరించారు.

ప్రవక్త మ‌హమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొనసాగుతున్న నేప‌థ్యంలో అల్ల‌రి మూక‌ల‌కు బీజేపీ ఎంపీ సాక్షి మ‌హారాజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. శుక్రవారం రాళ్లు రువ్వితే వారికి పైకి శ‌నివారం బుల్డోజర్లు బ‌య‌లుదేరుతాయ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా గత శుక్రవారం విస్తృత నిరసనలు జ‌రిగాయ‌ని, వాటిలో కొన్ని హింసాత్మకంగా ఉన్నాయని ఆయ‌న తెలిపారు. 

hijab row : హిజాబ్ నిషేధం.. మంగళూరులో తరగతులకు దూరంగా ఉంటున్న పలువురు ముస్లిం బాలిక‌లు

నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై గ‌త శుక్ర‌వారం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్, జార్ఖండ్ లోని రాంచీలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. అయితే యూపీలో అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసుల చర్యను ‘రిటర్న్ గిఫ్ట్’గా యూపీ బీజేపీ ఎమ్మెల్యే అభివర్ణించిన కొద్ది రోజులకే సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి పోలీస్ లాకప్ లోపల హింసకు పాల్పడిన వారిని కొట్టిన వీడియోను షేర్ చేస్తూ ‘బల్వాయియోన్ కో రిటర్న్ గిఫ్ట్ (అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్)’ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ పోస్ట్ చేశారు. 

జమ్మూలో ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్న చిరుతపులి..

కాగా నిరసనకారులు హింసకు పాల్పడితే ఇలాంటి చర్యలే కొనసాగుతాయని బీజేపీ నేత సాక్షి మహారాజ్ మంగళవారం అన్నారు. ‘‘యూపీ మే అగర్ శుక్రవర్ కో పత్తర్ చలేగా తో శనివర్ కో బుల్డోజర్ భీ జరూర్ చలేగా (యూపీలో శుక్రవారం రాళ్ళు రువ్వటం జరిగితే, బుల్డోజర్లు కూడా శనివారం తప్పక వస్తాయి) ’’ అని ఆయ‌న అన్నారు. శుక్రవారం జరిగిన హింసాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్ లో అల్లర్ల అనుమానితుల ఇళ్లను కూల్చివేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అధికారంలో లేకపోతే పరిస్థితి అదుపు తప్పేదని సాక్షి మహారాజ్ బుల్డోజర్ చర్యను సమర్థించారు. 

బీజేపీ బుల్డోజ‌ర్ ను రాజ్యాంగం నిలువ‌రిస్తుంది - స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

కాగా ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ జూన్ 5న తమ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను సస్పెండ్ చేయడంతో పాటు మరో నేత నవీన్ కుమార్ జిందాల్ ను బ‌హిష్క‌రించింది. జ్ఞాన్ వ్యాపి మ‌సీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో నూపుర్ శ‌ర్మ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల అరాధ్యుడైన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో రెండు వ‌ర్గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ప్ర‌యాగ్ రాజ్ తో పాటు మ‌రి కొన్ని ప‌ట్ణ‌ణాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ప‌శ్చిమ బెంగాల్ లోని హౌరా చేప‌ట్టిన నిర‌స‌న‌లు కూడా హింసాత్మ‌కంగా మారాయి. జార్ఖండ్ లోని రాంచీలోనూ హింసాకాండ చెల‌రేగింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 29 మందిని అరెస్టు చేసిన‌ట్టు ఆ రాష్ట్ర పోలీసులు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు.