బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ, జేడీ (యూ) మధ్య విభేదాలు నెలకొన్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య వైరం వల్ల బీహార్ తగలబడిపోతోందని ఆరోపించారు.
అగ్నిపథ్ పై చెలరేగుతున్న నిరసనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. బీహార్ లో చెలరేగుతున్న ఆందోళనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, నితీస్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) కి మధ్య జరుగుతున్న పోరులో బీహార్ తగలబడిపోతోందని అన్నారు. కూటమి పార్టీల మధ్య ఘర్షణను ప్రశాంత్ కిషోర్ ఎత్తి చూపారు.
“ అగ్నిపథ్ కోసం ఉద్యమం జరగాలి కానీ హింస, విధ్వంసం కాదు. జేడీ (యూ), బీజేపీ మధ్య విభేదాల భారాన్ని బీహార్ ప్రజలు భరిస్తున్నారు. బీహార్ దగ్ధమై ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. విషయం తేల్చుకోకుండా ఒకరినొకరు నిందించుకుంటున్నారు ’’ అని ఆయన ట్వీట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక నిరసనలను ఆపడానికి నితీష్ కుమార్ ప్రభుత్వం తగినంత ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. కాగా బీహార్ బీజేపీ చీఫ్ ఆఫీసుపై నిరసనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీహార్ ఉపముఖ్యమంత్రి రేణుదేవి ఇంటిని, పలు బీజేపీ ఆఫీసులను ఆందోళకారులు ధ్వంసం చేశారు.
హైద్రాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీరు, వాహనదారుల ఇక్కట్లు
“ మేము అగ్నిమాపక దళానికి కాల్ చేసినప్పుడు, వారు లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లు అనుమతిస్తేనే ఫైర్ ఇంజన్లు వస్తాయని చెప్పారు. ’’ అని బీహార్ బీజేపీ చీఫ్ జైవాల్ అన్నారు. బీహార్‌లోని బెట్టియా పట్టణంలోని తన ఇంటిపై దాడిని ఆపడానికి రాష్ట్ర అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతూ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “ మేము రాష్ట్ర ప్రభుత్వ సంకీర్ణంలో భాగం, కానీ దేశంలో ఎక్కడా ఇలాంటివి జరగలేదు, ఇది బీహార్‌లో మాత్రమే జరుగుతోంది. బీజేపీ నాయకుడిగా ఈ ఘటనను ఖండిస్తున్నాను. ’’ అని అన్నారు.
బీజేపీ చీఫ్ హెచ్చరికలపై జేడీయూ స్పందించింది. నిరసనలపై తమ పార్టీని అనవసరంగా నిందించినందుకు కూటమి భాగస్వామిపై జేడీ (యూ) ఎంపీ రాజీవ్ రంజన్ మండిపడ్డారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లోనూ నిరసనలు జరుగుతున్నాయి. యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు, అందుకే వారు నిరసనకు దిగారు. వాస్తవానికి హింస మార్గం కాదు. హింసను మేము అంగీకరించలేము. కానీ బీజేపీ ఈ యువకులను ఆందోళనకు గురిచేస్తున్నది, వారి ఆందోళనలను కూడా వినండి. దానికి బదులు బీజేపీ అడ్మినిస్ట్రేషన్ ను నిందిస్తోంది. దానికి అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది ’’ అని రాజీవ్ రంజన్ ఒక వీడియో విడుదల చేశారు.
కొత్త భవనంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు: స్పీకర్ ఓం బిర్లా
ఇతర రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ భవిష్యత్తుపై యువత ఆందోళన చెందుతున్నారని, అందుకే నిరసనకు దిగారు. వాస్తవానికి హింస మార్గం కాదు. మేము హింసను అంగీకరించలేము. అయితే ఈ యువకుల ఆందోళన ఏమిటో, వారి ఆందోళన ఏమిటో బీజేపీ కూడా వినాలి. దానికి బదులు బీజేపీ పరిపాలనను నిందిస్తోంది. పరిపాలన ఏం చేస్తుంది? నిరసనకారుల కోపాన్ని అదుపు చేయలేక నిరుత్సాహానికి గురైన బీజేపీ పరిపాలనపై నిందలు వేస్తోంది’’ అని రంజన్ వీడియో ప్రకటనలో తెలిపారు.
Agnipath: ఆగని అగ్నిపథ్ ఆందోళనలు.. లూథియానా రైల్వే స్టేషన్ ధ్వంసం !
ఇదిలా ఉండగా అగ్నిపథ్ పై ఇంకా కొన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్‌లలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలలో అగ్నివీర్ లకు 10 శాతం కోటా ఉంటుందని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఇది అదనంగా ఉంటుంది. కాగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు పోలీసు ఉద్యోగాల్లో ప్రియారిటీ ఇస్తామని ప్రకటించాయి.
