పొరుగింట్లో ఉంటున్న మహిళపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు.. ఆమె కేసు పెడుతుందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని గోరెగాం ప్రాంతానికి చెందిన సిరిల్ అనే 60 ఏళ్ల వృద్థుడు ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడు
పొరుగింట్లో ఉంటున్న మహిళపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు.. ఆమె కేసు పెడుతుందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని గోరెగాం ప్రాంతానికి చెందిన సిరిల్ అనే 60 ఏళ్ల వృద్థుడు ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడు. అనంతరం తన భార్య, కూతురితో కలిసి ఓ అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నాడు. పొరుగింట్లో ఉంటున్న 35 ఏళ్ల వివాహిత బయటకు వెళ్లి ఇంటికి వస్తూ తన ఫ్లాట్‌కి వెళ్లింది. లిరిల్ కూడా లిఫ్ట్ ఎక్కి పొరుగింటి ఆమె కావడంతో మాట కలిపాడు.
లిఫ్ట్‌లో వాళ్లిద్దరే ఉండటంతో ఇదే అదనుగా భావించిన సిరిల్ ఆమెను కిందపడేసి అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కొట్టాడు. ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ సిరిల్ బారి నుంచి తప్పించుకుని కిందకు వచ్చి ఇరుగుపొరుగు వారికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జనాన్ని చూసి... కేసుకు భయపడి అపార్ట్‌మెంట్ నుంచి తప్పించుకున్న సిరిల్ అక్కడికి సమీపంలోని షాపింగ్‌మాల్ పైకి చేరుకుని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే మహిళ ఫిర్యాదును అందుకున్న పోలీసులు సిరిల్ కోసం గాలిస్తుండగా.. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఘటనాస్థలికి చేరుకుని అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
