కూతురు భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొడుకుని, తల్లిని కాదని ప్రియుడితో లేచిపోయింది. దీంతో... తట్టుకోలేని మహిళ... కూతురు కొడుకుని దారుణంగా చంపేసింది.  ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కేఆర్ పేట మారుతినగర్ కు చెందిన లక్ష్మి అనే మహిళకు చాలా ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.

ఆమెకు కొడుకు పుట్టిన తర్వాత భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు.  దీంతో.. కొడుకు ప్రజ్వల్(11) తో కలిసి తల్లి సావిత్రి తో ఉంటోంది.  లక్ష్మీకి కొంతకాలం కిందట ఫేస్‌బుక్‌లో మంగళూరుకు చెందిన వ్యక్తితో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుని వద్దకు వెళ్లిపోయింది.

దీంతో పరువు పోయిందని మనస్తాపం చెందిన తల్లి సావిత్రమ్మ మనవడితో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సోమవారం పాఠశాల నుంచి ప్రజ్వల్‌ను తీసుకువచ్చిన సావిత్రమ్మ పట్టణానికి సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి చేతులు,కాళ్లు కట్టేసి చెరువులో నెట్టేసింది. తానూ దూకబోతుండగా స్థానికులు గమనించి ఆమెను రక్షించి పోలీసులకు అప్పగించారు. 

విచారణలో మనవన్ని చెరువులోకి తోసేసినట్లు వెల్లడించడంతో అగ్నిమాపక సిబ్బందితో కలసి పోలీసులు గంటకుపైగా గాలించి ప్రజ్వల్‌ మృతదేహాన్ని వెలికితీశారు. జిల్లా ఎస్పీ పరుశురామ్‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రజ్వల్‌ మృతి వార్త తెలుసుకొని తల్లి లక్ష్మీ ప్రియునితో కలిసి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని తన కొడుకును తల్లి సావిత్రమ్మే హత్య చేసిందని ఆరోపించింది. బాలుడు కాళ్లుచేతులు కట్టేసి ఉండడంతో ఎవరో కుట్రతోనే నీటిలో తోసేసి ఉంటారని,  అనుమానిస్తున్నారు. లక్ష్మీ, ఆమె ప్రియుడు విచారణ నుంచి జారుకుని వెళ్లిపోయారు.