Asianet News TeluguAsianet News Telugu

Republic Day 2022: వైవిధ్య సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ.. ఘ‌నంగా రిప‌బ్లిక్ డే వేడుక‌లు.. !

Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంటోంది. ప‌రేడ్ లో మొద‌ట‌గా ఇండియ‌న్ ఆర్మీ ప‌రాక్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రేడ్ కొన‌సాగింది. అనంత‌రం భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతున్నాయి. 
 

After Indias Military Prowess, State Tableaus Reflect Cultural Diversity At Rajpath
Author
Hyderabad, First Published Jan 26, 2022, 11:58 AM IST

Republic Day 2022:  భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌ట‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు.రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంటోంది. ప‌రేడ్ లో మొద‌ట‌గా ఇండియ‌న్ ఆర్మీ ప‌రాక్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రేడ్ కొన‌సాగింది. అనంత‌రం భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతున్నాయి. 

 


రిప‌బ్లిక్ డే 2022 ప‌రేడ్ లో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్  'భారత వైమానిక దళం భవిష్యత్తు కోసం వినూత్నంగా ముందుకు సాగుతూ.. అనేక మార్పులు తీసుకుంటున్న‌ద‌నే' అనే థీమ్‌ను ప్రదర్శిచింది. 

రిప‌బ్లిక్ డే నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి, అయితే, ఈ సంవత్సరం నుండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుండి గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.

 

అంతకు ముందు Republic Day  ను పురస్కరించుకొని Rajpathలో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి Ramnath Kovind ఆవిష్కరించారు.  కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ పేరేడ్ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన అతిథుల మధ్య భౌతిక దూరం పాటించేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. భారత సైనిక సామర్ధ్యం చాటి చెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. రాజ్‌పథ్ లో యుద్ద ట్యాంకులను ప్రదర్శించారు.  75 విమానాలతో వాయుసేన విన్యాసాలను నిర్వహించింది. రఫుల్, సుఖోయ్, జగ్వార్ , అపాచీ యుద్ద విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

 

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇవాళ 73వ గణతంత్రి దినోత్సవాన్ని భారత్ జరుపుకొంటుంది. రిపబ్లిక్ డే పరేడ్ భారతదేశం యొక్క సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతుంది. అంతకుముందు విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఏఎస్ఐ బాబురామ్ కు ఆశోక్ చక్రను రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు.

 

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ సాయుధ దళాల సిబ్బంది, ఇతరులకు 384 అవార్డులను అందించారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులు ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. నలుగురికి పద్మ విభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని రాజ్‌పథ్ లో  నిర్వహించిన పరేడ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 480 మందికి పైగా నృత్యకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అంతేకాదు పలు రాష్ట్రాలతో పాటు పలు ప్రభుత్వ రంగాలకు చెందిన 21 tableuaux పరేడ్ లో చోటు దక్కించుకొన్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios