బీజేపీలో కలకలం .. గంభీర్ బాటలోనే , ఎన్నికల విధుల నుంచి తప్పించండి: నడ్డాను కోరిన ఎంపీ జయంత్ సిన్హా

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జయంత్ సిన్హా పార్టీలో కలకలం రేపారు. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సిన్హా అభ్యర్ధించారు. ఆయన వైఖరిని చూస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదన్న సంకేతాలు పంపుతోంది.

After Gautam Gambhir BJPs Jayant Sinha asks to be relieved of electoral duties ksp

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జయంత్ సిన్హా పార్టీలో కలకలం రేపారు. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సిన్హా అభ్యర్ధించారు. ఆయన వైఖరిని చూస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదన్న సంకేతాలు పంపుతోంది. సిన్హా చెబుతున్న దాని ప్రకారం.. ఆయన ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టేందుకు విరామం కోరుకుంటున్నాడు.

‘‘ భారత్ , ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై నేను నా ప్రయత్నాలను కేంద్రీకరించగలిగేలా తన ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి నన్ను తప్పించవలసిందిగా జేపీ నడ్డాను అభ్యర్ధించాను. వాస్తవానికి నేను ఆర్ధిక, పాలనా సమస్యలపై పార్టీతో కలిసి పనిచేస్తూనే వుంటాను ’’ అని జయంత్ సిన్హా ట్వీట్ చేశారు. 

‘‘ గడిచిన పదేళ్లుగా భారత్, హజారీబాగ్ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు లభించింది. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దలు అందించిన అవకాశాలకు హృదయపూర్వక ధన్యవాదాలు .. జైహింద్ ’’ అంటూ  ట్వీట్ చేశారు. 

జయంత్ సిన్హా జార్ఖండ్‌లోని హజారీబాగ్ ఎంపీ . గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఆర్ధిక , పౌర విమానయాన శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. మూడు సంవత్సరాల కాలంలో భారతదేశంలోని ఆపరేషనల్ ఎయిర్‌పోర్టుల సంఖ్యను 50 శాతం విస్తరించిన UDAN , ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రారంభించడంలోనూ జయంత్ కీలకపాత్ర వహించారు. ‘‘డిజిటల్ స్క్రై డ్రోన్ పాలసీ’’, ‘‘డిజియాత్ర’’ డిజిటల్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌తో సహా అనేక డిజిటల్ కార్యక్రమాలను కూడా ఆయన అమలు చేశారు. 

 

 

కాగా.. క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి సారించడానికి తనను రాజకీయ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నడ్డాను అభ్యర్ధించిన కొన్ని గంటల తర్వాత సిన్హా సైతం అదే తరహా ప్రకటన చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. ‘‘ క్రికెట్‌ కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్ధించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. జైహింద్ ’’ అంటూ గంభీర్ శనివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 

ఇకపోతే.. శుక్రవారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మారథాన్ సమావేశం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వారాంతంలో కానీ, వచ్చే వారంలో లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం వుంది. రిపోర్ట్ ప్రకారం.. అభ్యర్ధుల జాబితాలో ప్రధాని మోడీతో సహా మరికొందరు కీలక నేతల పేర్లు వుండే అవకాశం వుంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. అర్ధరాత్రి జరిగిన సీఈసీ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 50 లోక్‌సభ స్థానాలపై చర్చించారు. వీటిలో సగం బీజేపీ తన అభ్యర్ధులను ప్రకటించే అవకాశం వుంది. బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ (సోనేలాల్ పటేల్)కి రెండు సీట్లు, జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు సీట్లు, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్పీబీఎస్పీకి ఒక సీటు, సంజయ్ నిషాద్ పార్టీకి ఒక సీటు కేటాయించే అవకాశం వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios