Asianet News TeluguAsianet News Telugu

జైలు నుండి బయటకు వచ్చి.. భార్య, అత్తమామలను కొడవలితో నరికి చంపి.. పోలీసుల దగ్గరికి వెళ్లి...

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, అత్తమామలను హత్య చేశాడు. ఆ తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే అతను అంతకుముందే జైలునుంచి వచ్చాడు. 

After coming out of jail man killed wife and in-laws with a machete in assam - bsb
Author
First Published Jul 25, 2023, 10:47 AM IST | Last Updated Jul 25, 2023, 10:47 AM IST

అసోం : అసోంలో దారుణ ఘటన వెలుగు చూసింది. గోలాఘాట్ జిల్లాలో ఓ వ్యక్తి సోమవారం తన భార్య, అత్తామామలను కొడవలితో నరికి హత్య చేశాడు. దీనికి కొన్ని కుటుంబ సమస్యలే కారణం అని తెలుస్తోంది. హత్యలు చేసిన తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

గోలాఘాట్ పట్టణంలోని హిందీ స్కూల్ రోడ్‌లోని అత్తగారింట్లో గొడవ జరిగింది. ఆ తరువాతే ముగ్గురిని కొడవలితో హతమార్చాడు నిందితుడు. "నిందితుడు గతంలో భార్యపై దాడి చేసినందుకు జైలులో ఉన్నాడు. జైలునుంచి విడుదలైన తర్వాత, అతను ఇంటికి వెళ్లి మళ్లీ గొడవ ప్రారంభించాడు. ఆ గొడవ ముదరడంతో తన భార్య, అత్తామామలను చంపాడు" అని పోలీసులు తెలిపారు. 

మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..

వీరందరినీ అంతమొందించిన తరువాత నిందితుడు తన తొమ్మిది నెలల కొడుకుతో కలిసి గోలాఘాట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ తాను హత్యలు చేసిన విషయం చెప్పి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.

మృతులను సంఘమిత్ర ఘోష్, ఆమె తల్లిదండ్రులు సంజీబ్ ఘోష్, జును ఘోష్‌లుగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన మొత్తాన్ని భార్య చెల్లెలు వీడియో కాల్ లో చూసింది. "కాజిరంగా యూనివర్సిటీ విద్యార్థిని అయిన భార్య చెల్లెలు దాడి సమయంలో తమ కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడుతుంది" అని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవలి కాలంలో దళితులపై మూత్రవిసర్జన, మలం పూయడం ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఘటన కలవరపెడుతోంది. 

ఓ యువకుడిపై ఒక వ్యక్తి, అతని సహచరుడు మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను జూలై 24న అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి, నిందితులకు శత్రుత్వం ఉంది. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని ఆగ్రా డీసీపీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. ప్రధాన నిందితుడు ఆదిత్య, అతని సహచరుడు భోలాను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

ఆదిత్యకు క్రిమినల్ నేపథ్యం ఉందని, జైలుకు కూడా వెళ్లాడని చెబుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదిత్య మూత్ర విసర్జన చేసిన బాధితుడు విక్కీగా గుర్తించబడ్డాడు, అతను ఫతేపూర్ సిక్రీ నివాసి అని పోలీసులు తెలిపారు. విక్కీ ఆచూకీ తెలియగానే పరిస్థితి తేలనుందని పోలీసులు తెలిపారు.

ఇలాంటి ఘటనలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ వ్యక్తి కూలీపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోను గ్రహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios