ఐపిల్ బెట్టింగ్ కేసు ఇప్పట్లో బాలీవుడ్ ను వదిలేలా లేదు. బెట్టింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి.ఇప్పటికే బాలివుడ్ స్టాన్ సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేరు బైటకురావడం,  బెట్టింగ్ కు పాల్పడ్డట్లు ఆయన ఒప్పుకోవడం కూడా తెలిసిన విషయమే. తాజాగా మరో బాలీవుడ్ నిర్మాతకు ఈ బెట్టింగ్ వ్యవహారంతో సంబంధాలున్నట్లు ప్రధాన నిందితుడు సోనూ జలన్ వెల్లడించినట్లు సమాచారం. 

ఐపిఎల్ బెట్టింగ్ వ్యవహారంలో సోను జలన్ పట్టుబడినప్పటి నుండి బాలీవుడ్ లో అలజడి మొదలైంది. ఈ వ్యవహారంతో సినీ ప్రముఖులకు సంబంధాలున్నట్లు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు బెట్టింగ్ పాల్పడ్డట్లు విచారణ సందర్భంగా సోను పోలీసులకు వెల్లడించాడు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా బెట్టింగ్ కు పాల్పడ్డట్లు సోనూ మరో బాంబ్ పేల్చాడు. సాజిద్ గత ఏడేళ్లుగా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అయితే  ఇంతవరకు పోలీసులు సాజిద్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. 

సాజిద్ ఖాన్ ప్రయుఖ నృత్యకారిణి, దర్శకురాలు పర్హా ఖాన్ సోదరుడు. ఈయన హౌస్ ఫుల్ సీరీస్ తో పాటు హిమ్మత్ వాలా వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఇపుడు ఈ ఐపిఎల్ బెట్టింగ్ వ్యవహారం ఆయన కెరీర్ పై ప్రభావం చూపించనుందని సినీ వర్గాలు చెబుతున్నారు.