అప్పుడు వాజ్‌పేయ్‌పై సోనియా: ఇప్పుడు మోడీపై కేశినేని

After 15 years Bjp faces no confidence motion
Highlights

దాదాపు 15 ఏళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాసం తెరమీదికి వచ్చింది.  2003లో వాజ్‌పేయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. తాజాగా  మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోంటుంది.  

న్యూఢిల్లీ: దాదాపు 15 ఏళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాసం తెరమీదికి వచ్చింది.  2003లో వాజ్‌పేయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. తాజాగా  మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోంటుంది.   నాడు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరిగింది. తాజాగా టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై చర్చ జరగనుంది.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టం అమలు చేయనందుకు నిరసనగా  కేంద్రంపై టీడీపీ సహ పలు విపక్షాలు  అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. అయితే ఈ అవిశ్వాసంపై   లోక్‌సభలో  జూలై 20న, రాజ్యసభలో జూలై 23న చర్చ జరగనుంది.

2003లో వాజ్‌పేయ్ సర్కార్‌లో కాంగ్రెస్ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది అప్పటి విపక్ష నేత సోనియాగాంధీ. వాజ్‌పేయ్ సర్కార్‌పై సోనియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా 189 ఓట్లు, అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా 314 ఓట్లు లభించాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.

ఆ తర్వాత 2008లో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యూపీఏ సర్కార్‌కు బయటి నుండి మద్దతిస్తున్న సీపీఎం ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొంది.  దీంతో మన్మోహన్ సర్కార్  ఆ సమయంలో  ఎలాగోలా గట్టెక్కింది. 

తాజాగా ఇప్పుడు మరో్సారి కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని విపక్షాలు తమ అస్త్రంగా ప్రయోగించాయి. కేంద్రం ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.నాడు వాజ్‌పేయ్ సర్కార్ పై సోనియాగాంధీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. తాజాగా మోడీ సర్కార్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు.
 

loader