శ్రద్ధా వాకర్‌ను తాను చంపలేదని అఫ్తాబ్ పూనావాలా అన్నారు. ఈ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. శ్రద్ధా వాకర్ కేసులో సాక్ష్యాధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు సాకేత్ కోర్టుకు సమర్పించారు. 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధా వాకర్ కేసులో మరో ట్విస్టు ఎదురైంది. తాను శ్రద్ధా వాకర్‌ను చంపలేదని నిందితుడు అఫ్తాబ్ పూనావాలా అన్నారు. ఈ కేసులో విచారణకు తాను సిద్ధం అని, విచారణ ఎదుర్కొంటానని చెప్పారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఐపీసీలోని సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యాధారాల విధ్వంసం)ల ఆరోపణలు నమోదయ్యాయి. 

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సుదీర్ఘకాలం ఆధారాల సేకరణకు కేటాయించారు. ఆ ఆధారాలను ఢిల్లీలోని సాకేత్ కోర్టులో సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు అభియోగాలు ఫ్రేమ్ చేసింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసిన అభియోగాలను ఈ రోజు సాకేత్ కోర్టు ఫ్రేమ్ చేసింది. కాగా, అఫ్తాబ్ పూనావాలా ఆ అభియోగాలను తిరస్కరించారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసు ప్రొసీడింగ్స్ జూన్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

జనవరి 24వ తేదీన ఢిల్లీ పోలీసులు శ్రద్ధా వాకర్ పై 6,629 పేజీల చార్జిషీట్ ఫైల్ చేశారు.

Also Read: ఫస్ట్ పీరియడ్స్ రక్తం చూసి.. ఎవరితోనో సెక్స్ లో పాల్గొందనే అనుమానంతో చెల్లెలిని హతమార్చిన అన్న..

తన బిడ్డ అస్థికలు అప్పగించాలని, తాము సంప్రదాయపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నదని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ కోర్టులో గత నెల డిమాండ్ చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలని, తద్వార తన కూతురు అంతిమ క్రియలు త్వరలోనే నిర్వహించడం సాధ్యం అవుతుందని వివరించారు. ఈ విచారణ నెల రోజుల్లో ముగించాలని, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.