అఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వస్తే.. ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంప ప్రకంపనలతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూమి ప్రకంపించింది. అఫ్ఘానిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించడంతో జమ్ము కశ్మీర్, ఢిల్లీలో భూమి కంపించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైంది. ఢిల్లీలో 5.2 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలిసింది.
జమ్ము కశ్మీర్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ సరిహ్దదులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంప కేంద్రం 181 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీలోనూ భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు.
Also Read: పండంటి కొడుక్కి జన్మనిచ్చిన ఇలియానా.. పేరు కూడా పెట్టేసిందిగా!
హిందూకుష్ పర్వత శ్రేణుల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. యూరేసియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఘర్షణతో ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. తాజా భూకంపంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.
