వివాహేతర సంబంధాలు: మహిళలకు శిక్ష విధించాలని పిటిషన్

Adultery law prima facie violative of right to equality, says SC
Highlights

వివాహేతర సంబంధాలను  నేరంగా పరిగణించే  ఐపీసీ పీనల్ కోడ్‌లోని 497 సెక్షన్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలను  నేరంగా పరిగణించే  ఐపీసీ పీనల్ కోడ్‌లోని 497 సెక్షన్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 

వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. 

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్‌ షైనీ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. 

వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటిస్తే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. 

వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు.  సెక్షన్‌ 497 ప్రకారం పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి.అయితే  ఈ విషయమై  సుప్రీంకోర్టులో జోసెఫ్ షైనీ పిటిషన్‌ దాఖలు చేశారు.

loader