Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ నేవీ కొత్త చీఫ్‌గా అడ్మిరల్ హరికుమార్.. కేరళ నుంచి తొలి వ్యక్తిగా ఘనత

భారత నావికాదళ 25వ చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాఫ్‌గా (indian navy chief ) అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ (admiral hari kumar) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్‌ కరమ్‌బీర్‌సింగ్‌ (admiral karambir singh) నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నుంచి నేవీ చీఫ్‌గా ఎదిగిన తొలి వ్యక్తిగా హరికుమార్ రికార్డుల్లోకెక్కారు. 

Admiral R Hari Kumar takes charge as new Navy chief
Author
New Delhi, First Published Nov 30, 2021, 4:47 PM IST

భారత నావికాదళ 25వ చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాఫ్‌గా (indian navy chief ) అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ (admiral hari kumar) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్‌ కరమ్‌బీర్‌సింగ్‌ (admiral karambir singh) నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.. భారత ప్రయోజనాలు, సవాళ్లపై తాను దృష్టిపెడతాను’’ అని చెప్పారు.

హరికుమార్‌ 1962లో ఏప్రిల్‌ 12న జన్మించారు. ఆయన 1983లో ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకొన్నారు. కేరళ నుంచి నేవీ చీఫ్‌గా ఎదిగిన తొలి వ్యక్తిగా హరికుమార్ రికార్డుల్లోకెక్కారు. తాజాగా భారత నావికాదళం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఓ పక్క ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతుండగా.. మరోపక్క చైనా వైపు నుంచి ముప్పు పొంచి ఉంది. అంతేకాదు హరికుమార్‌ సైనిక దళాల పునర్‌ వ్యవస్థీకరణలో కూడా కీలక పాత్ర పోషించారు. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ కాన్సెప్ట్‌ తయారీలో కూడా పనిచేశారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన హరికుమార్‌కు పలువురు ఉన్నతాధికారులు , సిబ్బంది అభినందనలు తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios