Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: క‌రోనా సోకితే.. అప్పుడే టీకాలు వ‌ద్దు ! రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కేంద్రం సూచ‌న‌లు

Coronavirus: క‌రోనా వైర‌స్ (Coronavirus) టీకాల‌కు సంబంధించి కేంద్రం ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. కొత్త‌గా  కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి కోలుకున్న వారికి వెంట‌నే టీకాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని సూచించింది. కోవిడ్‌-19 (Covid-19) నుంచి కోలుకున్న వ్య‌క్తుల‌కు టీకాలు మూడు నెల‌ల త‌ర్వాత ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేసింది. 
 

Administer vaccine doses three months after Covid-19 recovery: Centre to states
Author
Hyderabad, First Published Jan 23, 2022, 5:51 AM IST

Coronavirus: యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే అన్ని దేశాల‌కు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ఇదివ‌ర‌కు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్ర‌స్తుతం దాని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు లక్ష‌ల్లో న‌మోదుకావ‌డం కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది అధికార యంత్రాంగం.15-18 ఏండ్ల‌లోపు వారికి టీకాలు అందించ‌డంతో పాటు మ‌రికొన్ని ఏజ్ గ్రూప్ ల వారికి బూస్ట‌ర్ డోసులు సైతం అందిస్తోంది. 

ఈ నేప‌థ్యంలోనే క‌రోనా వైర‌స్ (Coronavirus) టీకాల‌కు సంబంధించి కేంద్రం ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. కొత్త‌గా కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి కోలుకున్న వారికి వెంట‌నే టీకాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని సూచించింది. కోవిడ్‌-19 (Covid-19) నుంచి కోలుకున్న వ్య‌క్తుల‌కు టీకాలు మూడు నెల‌ల త‌ర్వాత ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త (బూస్టర్‌) డోసునూ మూడు నెలల తర్వాతే వేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. శాస్త్రీయ ఆధారాలు, నేషనల్ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు జారీచేసినట్టు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్‌ షీల్  వెల్ల‌డించారు. అర్హులైన వారికి (Covid-19) రెండో డోసు పూర్తైన 39 వారాల తర్వాత అంటే తొమ్మిది నెలల తర్వాత బూస్టర్‌ డోసు వేయాలనీ, క‌రోనా (Coronavirus) బారిన‌ప‌డి కోలుకున్న వారికి మూడు నెల‌ల వ‌ర‌కు టీకాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని రాష్ట్రాల‌కు రాసిన లేఖ‌ల్లో పేర్కొన్నారు. 

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వైర‌స్ (Coronavirus)  వ్యాప్తి అధికం అవుతూనే ఉంది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా సాధార‌ణ వేరియంట్ల‌తో పాటు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా, అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్లు పంజా విసురుతున్నాయి. దీంతో క‌రోనా (Covid-19) బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లలో కరోనా వైరస్ (Covid-19) కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాలు సైతం  ఈ రాష్ట్రాల్లోనే అధికం చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు, (Coronavirus) మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్ లు టాప్-10 లో ఉన్నాయి.  దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతున్నది. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 17 శాతానికి పైగా ఉంది. కరోనా (Coronavirus) విజృంభ‌ణ కార‌ణంగా ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios