Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా.. ఎంసీడీ ఎన్నికల్లో ఘోర పరాజయమే కారణం..

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆదేశ్ గుప్తా తన పదవికి రాాజీనామా చేశారు. ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.

Adesh Gupta resigns as Delhi BJP president The reason for MCD's disastrous election defeat.
Author
First Published Dec 11, 2022, 2:00 PM IST

ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేష్ గుప్తా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామా చేసిన వెంటనే వీరేంద్ర సచ్‌దేవా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అయితే ఎంసీడీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మేయర్ పదవీపై బీజేపీ పట్టుసాధిస్తుందని వచ్చిన ఊహాగానాలకు ఆదేశ్ గుప్తా ప్రకటన ముగింపు పలికినట్టు అయ్యింది.

మహారాష్ట్ర మంత్రి ముఖంపై ఇంక్ దాడి.. అంబేద్కర్, ఫూలేలపై కామెంట్లతో ఆగ్రహం!(వీడియో)

ఇటీవల 250 వార్డులకు జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో 104 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ తొమ్మిది వార్డులను గెలుచుకుంది. కాగా.. ఈ ఎన్నికల్లో ఆదేశ్ గుప్తా నివసించే సీటును కూడా బీజేపీ గెలవలేకపోయింది. ఆయన ఎంసీడీ వార్డు నంబర్ 141లోని రాజేంద్ర నగర్‌లో నివసిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆర్తీ చావ్లా విజయం సాధించారు. అయితే దీనిపై ఆదేశ్ గుప్తా స్పందిస్తూ.. తనకు ఏ ప్రాంతం సొంతమైనది కాదని, తాను ఢిల్లీ మొత్తానికి అధ్యక్షుడినని అన్నారు. తాను ఢిల్లీ అంతటా పని చేస్తానని అన్నారు. ఆ ప్రాంతాలు ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందుతాయని చెప్పారు.

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ.. ఆరో వందే భారత్ ట్రైన్, మెట్రో, ఎయిమ్స్‌ ప్రారంభం.. వివరాలు ఇవే..

ఢిల్లీ ప్రజలు ఇప్పటికీ తమ పార్టీపై విశ్వాసం చూపారని అన్నారు. బీజేపీ దాదాపు 40 శాతం ఓట్లను సాధించిందని చెప్పారు. 2017లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 36.08 శాతం ఓట్లు రాగా, ఈసారి 39.09 శాతం ఓట్లు వచ్చాయని, దీన్ని బట్టి చూస్తే 3 శాతం ఓట్లు పెరిగాయని గుప్తా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత కూడా మా పనితీరు మెరుగ్గా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ గెలిచిందంటే ఆ పార్టీకి మద్దతు లభించినట్టు కాదని తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్‌లు ఉండే ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందని అన్నారు. 

2012లో ఉత్తర, దక్షిణ, తూర్పు కార్పొరేషన్‌లుగా విడిపోయిన ఎంసీడీ ఈ ఏడాది మళ్లీ ఒకటిగా కలిసింది. ఇలా ఏకీకృతమైన తరువాత వచ్చిన మొదటి ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అయితే దేశ రాజధాని పరిస్థితి మెరుగుపర్చడానికి బీజేపీ, కాంగ్రెస్ లు సహకరించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పౌర సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కేంద్రం, ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులు అందించాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios