Asianet News TeluguAsianet News Telugu

సంక్షోభ సమయంలో సమైక్య స్పూర్తిని చాటారు.. ఆ ఘనత దేశ ప్రజలదే: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

కోవిడ్-19 వ్యాక్సినేషన్ (vaccination) ప్రచారాన్ని సామూహిక ఉద్యమంగా మార్చినందుకు కోట్లాది మంది దేశప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) కృతజ్ఞతలు తెలిపారు. 73వ గణతంత్ర్య దినోత్సవాన్ని (Republic Day ) పురస్కరించుకుని ఆయన మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు

Address to the nation by the President Ram Nath Kovind on the eve of the Republic Day
Author
New Delhi, First Published Jan 25, 2022, 10:29 PM IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ (vaccination) ప్రచారాన్ని సామూహిక ఉద్యమంగా మార్చినందుకు కోట్లాది మంది దేశప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) కృతజ్ఞతలు తెలిపారు. 73వ గణతంత్ర్య దినోత్సవాన్ని (Republic Day ) పురస్కరించుకుని ఆయన మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి (coronavirus) సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో అధిక గంటలు పని చేస్తూ మానవాళికి సేవలందించిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహకారాన్ని రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. పిలుపు వచ్చినప్పుడు దేశానికి సేవ చేయడం అనే ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే, కోట్లాది మంది దేశప్రజలు పరిశుభ్రత ప్రచారాన్ని, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని సామూహిక ఉద్యమంగా మార్చారని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

ఇలాంటి ప్రచారాలను విజయవంతం చేసిన ఘనత విధేయతగల పౌరులకే దక్కుతుందని రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. స్వరాజ్యం కలను సాకారం చేసేందుకు సాటిలేని ధైర్యాన్ని ప్రదర్శించిన స్వాతంత్య్ర సమరయోధులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు. మన సైనికులు, భద్రతా సిబ్బంది జాతీయ ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు.

హిమాలయాలలో భరించలేని చలిలో, ఎడారిలోని విపరీతమైన వేడిలో కుటుంబాలకు దూరంగా ఉంటూ మాతృభూమిని కాపాడుతున్నారని రామ్ నాథ్ కోవింద్ కొనియాడారు. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను (netaji subhash chandra bose) కూడా ఆయన స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం కోసం ఆయన తపన, ఆశయం దేశానికి స్ఫూర్తినిచ్చాయని రాష్ట్రపతి గుర్తుచేశారు. రెండు రోజుల క్రితం జై హింద్ అనే ఉత్తేజకరమైన వందనం స్వీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకున్నామని రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios