మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, బీజేపీల మధ్య విభేదాలు నెలకొన్నాయనే విషయం వెల్లడింది. ఏక్‌నాథ్ షిండే వార్తా పత్రికలకు విడుదల చేసిన పత్రికలో ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో లేకపోవడం రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించి మాట్లాడారు. 

ముంబయి: మహారాష్ట్రలో అధికార కూటమిలో పొరపొచ్చాలు బయటపడ్డాయి. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు, బీజేపీకి మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టంగా వెల్లడయ్యాయి. తాజాగా, మహారాష్ట్ర బీజేపీ కూడా ఈ విభేదాలను గుర్తించడం గమనార్హం. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు, గొడవలు రావా? అంటూ పేర్కొనడం ఇందుకు తార్కాణం.

మహారాష్ట్రలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ఏక్‌నాథ్ షిండేనే ఎక్కువ మంది కోరుకుంటున్నారని ఇటీవలే ఓ సర్వే తేల్చిన నివేదిక సంచలనంగా మారింది. ఏక్‌నాథ్ షిండే వర్గంలో ఒక ధైర్యం వచ్చింది. ఇదే తరుణంలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వార్తా పత్రికలకు ఇచ్చిన యాడ్ కలకలం రేపింది. వార్తా పత్రికలో వచ్చిన ప్రకటనలో కేవలం సీఎం ఏక్‌నాథ్ షిండే, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపింది. ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కొరవడిందనే భావన తెచ్చింది. 

ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరో యాడ్ విడుదల చేసి అందులో దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటోనూ పెట్టింది. రాజకీయంగా దుమారం రేపిన ఈ ప్రకటనల ఉదంతానికి సంబంధించి మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బావాంకులీ మాట్లాడారు. ఈ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు.

Also Read: మహిళల లోదుస్తులు దొంగిలించి హస్తప్రయోగం చేసుకుంటున్న సైకో.. వీడియో తీసి పోలీసులకు స్థానికుల ఫిర్యాదు

ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా కొట్లాడుకుంటారు. అలాగే.. ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చేమో. కానీ, ఇప్పుడు ఆ యాడ్ విభేదాలు క్లియర్ అయ్యాయని వివరించారు. మరో యాడ్‌లో అందరూ ఉన్నారని పేర్కొంటూ ఇంతటితో ఈ చర్చకు ముగింపు చెబుదామని తెలిపారు.