బెంగళూరులో ఓ సైకో ఇళ్లలోకి దూరి మహిళల దుస్తులు ఎత్తుకెళ్లుతున్నాడు. వాటిని ఎత్తుకెళ్లి హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. ఇలా చేసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి వీడియో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సైకో రెంట్‌కు గది తీసుకుంటామని ఎలాంటి సంశయాలు లేకుండా ఇళ్లల్లోకి దూరుతున్నాడు. చాలా సేపు ఆ ఇంట్లోనే గడుపుతున్నాడు. వారి వాష్‌రూమ్‌లూ చాలా సేపు వాడుకుంటున్నాడు. ఇంటి వెనక్కి వెళ్లి బట్టలు ఎండేసే ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి నుంచి మహిళల లోదుస్తులు ఎత్తుకెళ్లుతున్నాడు. ఆ తర్వాత హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను స్థానికులు తీసి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లగ్గారేలోని విధాన సౌదా లేఔట్‌లో చోటుచేసుకుంది.

చాలా మంది ఆ సైకోను పలుమార్లు ఆ ఏరియాలో చూసి ఉన్నారు. 

రాజగోపాల్‌నగర్ పోలీసు స్టేషన్‌లో స్థానికులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘ఆ వ్యక్తి రెంట్ గది కోసం వెతుకుతున్నట్టు సరాసరి ఎలాంటి జంకు లేకుండా ఇంట్లోకి వెళ్లుతాడు. ఒకసారి ఇంట్లోకి వెళ్లగానే.. వారి వాష్‌రూమ్‌లలోకి వెళ్లి చాలా సార్లు ఉంటాడు. అంతేకాదు, ఆ ఇంటి పెరటిలోకి, వెనుక ఖాళీ స్థాలాల్లోకి, బట్టలు ఎండే చోటుకి వెళ్లుతాడు. అక్కడ మహిళలు ధరించే దుస్తులను చూస్తాడు. ముఖ్యంగా మహిళలు ధరించే లోదుస్తులు, బ్లౌజ్‌లు దొంగిలించి అతని పర్వర్టెడ్ ప్లెజర్‌కు ఉపయోగించుకుంటాడు’ అని వివరించాడు.

Also Read: బ్రిజ్ భూషణ్‌పై దాఖలైన పోక్సో కేసు కొట్టేయండి, ఆధారాల్లేవు: కోర్టుకు ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి

ఓ ఇంటి వెనుకాల ఉన్న లాండ్రీ బాస్కెట్‌లో నుంచి ఒక మహిళకు చెందిన బ్లౌజ్ తీసుకుని, హస్తప్రయోగం చేసుకున్నాడు. ఈ ఘటనను సమీపంలోని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను పోలీసులకు పంపించాడు. 

గతంలో కొన్ని సీరియల్ కిల్లర్ కేసుల్లో దోషుల ప్రవర్తనలు ఇలాగే ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే కేసు ఫైల్ చేసి ఆ సైకో కోసం గాలింపులు జరుపుతున్నారు.